ఇష్టం లేని వాక్యమే
ఈ సమాధి. అంతమవ్వని ఇష్టం.
తెగని గ్రీన్ గ్రీఫ్
శవపేటిక శ్వాసిస్తోంది మూడు ముళ్ళ బొడ్డుతో.
ఏ చిత్రం కిందో
అలుక్కుపోయిన అలలు.
ఆలోచించి చెప్పకు
కన్నీళ్ళు ఏమంటున్నాయో.
నేత్రంలో లేని అక్షరాల్తో
వస్తావా? రాకే.
రా ... వద్దు
పూర్ణాంతర శూన్యంలోకి.
No comments:
Post a Comment