పాతిపెట్టిన విత్తనంలోని చిగురాకూ నిద్రలో ఉంది
ఎందుకు నన్నీ వాక్యంముందు లేని అద్దంలో ఉంచుతావ్
తిరిగి చూడని అర్థాల్తో కాలం నల్లబడింది
ప్రేమే మరొక నలుపు కుంచె
నిస్తేజమైన వస్తువులన్నీ కదులుతున్నాయ్
నా నిరీక్షనే ప్రయాణించట్లేదు
ఏ వెలితీలేని అక్షరాలమధ్య
మళ్ళీ అక్షరం రాయటమే దుఃఖం
నువ్వు నన్ను సమాధిచేసుకునే నిశ్శబ్దానివి
2 comments:
ఏ వెలితీలేని అక్షరాలమధ్య
మళ్ళీ అక్షరం రాయటమే దుఃఖం
"సర్వ భావాలకూ వశుడై, పిమ్మట సర్వ భావాలనూ తన వశం చేసుకొని" అన్న అక్కిరాజు ఉమాకాంతం మాటలు ఇక్కడ నిజమైనట్టున్నాయి.
ఇప్పటి సో-కాల్డ్ "కవుల్లో" ఈ దుఃఖం ఎంతమందికి కలుగుతుంది?
మంచి కవిత, నాయుడు గారూ !
నిజం చెప్పారు - అన్నగారు (@ Raghu gaaru)
నిజమైన అనుభూతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే వాక్యమిది. ఇటువంటి ఒక్క లైను చాలు, కవిత్వం ఇది అని చెప్పటానికి.
Post a Comment