మరుగుతున్న విశ్రాంతి కుంపట్లోంచి
బైటికొచ్చిన చంద్రుడిపై రాత్రినీళ్ళని చల్లాను.
ఆకాశం నక్షత్రాల బొగ్గుల్ని రాజేస్తూనే ఉంది.
వెన్నల విభూది రాసుకున్న నదిలో
రహస్య రెక్కల్తో రికామిగా తిరిగే
కలల్ని విప్పి కుంపట్లోకి విసిరాను.
మనసు లంగోటీని గిరాటేశాను.
వేయి సముద్రాల ఇంద్రధనుస్సై
నిద్ర, దేహంలో జడ విరబోసుకుంది.
ఏ దారీతెన్నూలేని సూర్యుడే
పసిపిల్లల కేరింతల్లా ఒక్కసారిగా
నన్నీ యవ్వన రోమ్ముల్లాంటి దినచర్యల్లోకి గెంటాడు.
నిద్ర మళ్ళీ ఎప్పుడో.
2 comments:
hai naidu..
ee nee kavita baagundi.
enduku baagundo cheppadamantae mallee kavitani modatinumchi chivaridaakaa raayadamae kadaa. aa pani nenu cheyalenu. antaku minchina prayatnam mundu mundu eppudainaa chaeyagalananukuntunnaanu.
nee blog lo telugulu lo type chaese soukaryam untae inkaa baaguntundi.
abhinandanalatO
bi.ajay prasad
!!
Post a Comment