ఇప్పటిది కాదులే
శరీర వాసన
జ్వలించి, జల్లించి, జాతరించి
పేనిన మమైకాన్ని తోడు
తోడు రాని
తోడ ...తొడ
శహన రాగపు రంగేది?
ఒడలిన ఒదిలిన
వయో స్వప్నాల్లో నువ్వెవరు?
ముకుళించే
రూపనాదాలన్నీ అలిఖితాలేనా?
కృశించే జన్మ క్రియలన్నీ
అలభ్య అజ్ఞాతాలేనా?
ఇప్పటిది కాదులే
వాక్య వ్యళీకం
No comments:
Post a Comment