గదిలోపల దీపం ఊపిరి
తగ్గుతోందన్న వణుకు
కళ్లు తెరిచి అన్నింటినీ
చివరిగా పరికిస్తోంది
హత్తుకోగల్గిన
రూపమేదీ లేదు
పవిత్ర ఆనందం
క్షీణిస్తోంది
స్వాధీన
స్పర్సలు లేవు
నాట్యముద్రల చాయలన్నీ
ఆహార్యాల ముడులిప్పుకుంటున్నాయి
తనలో తానూ
తలవంచుకుంటోంది దీపం
నిశ్శబ్దాన్ని ద్వేషిస్తూ
2 comments:
అయ్యా..కవిత ఎంత బాగుందో చెప్పలేను. మీ blog కూడలిలో ఉంచారా?
మీరు కూదలి.ఒర్గ్, జల్లెడ.ఒర్గ్ లాంటి సాఇట్లలో మీ బ్లాగును కలపకపోతే ఎవరికీ కనిపించకండా పోయే ప్రమాదముంది.
looking forward to reading more of your poems
సూపర్. చాలా బాగుందండి.
koodali.org, jalleda.com లలో మీ బ్లాగు కలపండి. మీ పోస్టులు వచ్చిన వెంటనే మాకు తెలుస్తుంది.
Post a Comment