Followers

Monday, December 21, 2009

స్వప్న రేణువులు

చీకటి కొమ్మలపై
చంద్రుడి గాలిపటం
చిరక్కుండా
- -
పారిపోయొచ్చిన హరివిల్లుని
ఇంటికి తీసుకెళ్ళింది తూనీగ
- -
నిదుర పలకని
కలల్తో బరికాను
ఇక తుడిచేదెవరో
- -
పథికుల కోసం
నిద్ర చీకటిలో
దీపాల్ని వెలిగిస్తోంది కల
- -
ఏ దీనురాలి బిడ్డలో
మెరుపు పిల్లలు
దారి తప్పారు
- -
గాలి వాసన
చడీచప్పుడు లేకుండా
అద్దంలో
- -
దిండు కింద కల
నక్కిన పేనులా నిద్ర
- -
లేలేత రెక్కలతో
తిరుగుతోంది
నా కల కొండ
- -
నా పడక నేలమీదే
కలలకే దుమ్మంతా
- -
నిద్ర చెరువులో
నీటి కుక్కను
తోకాడిస్తూ కలలు
- -
స్వప్న రహదారిలో
అడ్డంగా సూర్యుడు
- -
మట్టి పడవలు ఎక్కుతున్న
కల ఒకటి
నిద్ర తీరాన్ని చేరేదేప్పుడో!

3 comments:

Bolloju Baba said...

నాయుడు గారు
మీ స్వప్న రేణువులు చాలా బాగున్నాయి. అద్బుతమైన భావుకత. చాలా చాలా లోతైన పదచిత్రాలు. మీ శైలి లో లోతు, గూఢత, రమ్యత లు ఇంత చిన్ని వాక్యాలలో ఒదిగిపోవటాం అబ్బురంగా అనిపిస్తుంది.
వండర్ ఫుల్.

పథికుల కోసం
నిద్ర చీకటిలో
దీపాల్ని వెలిగిస్తోంది కల
ఎంత అందమైన ఊహ అండీ. అద్బుతంగా ఉంది. పై రేణువుకు సాస్టాంగ ప్రమాణం చేయాలనిపిస్తూంది.
ధన్యవాదములు
బొల్లోజు బాబా

బాలకృష్ణ said...

Contradiction between sleep and dream has been fully exposed. Nice work.

You short poems are definitely making more sense these days, may be because it is the way you think.Your images are more realistic, may be this is derogatory remark for you.

Longer poems are still distracting readers imagination. I hope that you are not wishfully doing that.

Any way this poem is one of your best in my view although there are couple of influences(of old poets) showing up.

Unknown said...

మీ మార్మిక, పదచిత్ర కవిత అద్భుతంగా వుంది.

లేలేత రెక్కలతో
తిరుగుతోంది
నా కల కొండ

"నా కలల కొండ" అంటే ఇంకా బాగుండేదేమో !