Followers

Saturday, December 26, 2009

వాక్య హీనుడా ...

చీకటి బిందువులతో వాక్యాల్ని చెరిపేయగలవు

పదాల మధ్య బొంగురుగా మొరుగుతున్నా
అంతటా శునక నిశబ్దమే

దేవుడా!
నాకో తొంబై లక్షల నాలుకలివ్వు

అర నాలుకేనా ఇంకెప్పటకీ

పోనీ,
అరిగిపోని, ఆవిరవ్వని, అంటురోగమవ్వని
ప్రాంతీయ భక్తైనా

నా నాలుకపై రాయబ్బా

నీయబ్బ
ఈ నత్తి నెత్తుటి నాలుక నేలమీద
నీ నీడుండదు
ఇంకెప్పటికీ

2 comments:

Afsar said...

naayudu gaaroo:

mee blaagaavataaram baagumdi. ekkadunnaaru? elaa vunnaaru?

ee kotta poem baagumdi.

afsar

Bolloju Baba said...

bagundi. mI sailiki alavaaTu paDutunnaanu.
:-)