ప్రతి వాసనొక పశ్చాతాపమే
నిరాటంక సమయంలో
ఏ నేత్రం ఎవరిదో
ఎవరికి తెలుసు
ఆగు
ఆగు ...అని పిలిచే మురికి కన్నీటిని
నలుదిక్కుల్లోంచి మోసుకొచ్చే మాటలే
బరువు నాలుకలోనూ
కదలని వాక్యమే సమాధి
కాలమానాల్లేని స్మశానం
ఎవరి దేహంలోనూ ఉండదు
కాస్త విడిపోవటానికే
శవపేటిక భాష
పేగుపోగుల్లో మంటలు
బతికుండే అంత్యక్రియలు
ఏ జ్ఞాపక స్థలంలోనో
సూర్యచంద్రులు
గుమికూడిన గుబుల్ని భుజాన్నెత్తుకుని
ఏ ఆకాశ తీరంలోకో నడవాలి
No comments:
Post a Comment