మరికొన్ని మాటల్ని చీకట్లో ఉంచి, చీకట్లోంచి చిట్టెలుక అక్షరాల్ని నాలుకపై దిద్దుకొని, అటూ ఇటూ ఎగిరే కెరటాల కంటికంతిలోకి చుట్టుకుపోయే రేయింబవళ్ళనో , రేగుపళ్ళ నిద్రలోంచి బైటికి రాలేక, ఓ తోవా లేక, ఓ తోపుగాడు నీ పక్కనే, నాపక్కలో, పలకమీద అందపిండాలు, అండపిండాలు పెడుతుంటే, ఎవరి కళ్ళల్లోని కాలో, కలో మాటల్లోకి చేరి చెరిగిపోకుండా, దురదై, దూదై, ధూపమై దేకుతూ మరోచోటేదీ కానరాక, అక్షారాల్ని గోక్కుంటూ రంగురంగుల గులకోసం గుళ్ళస్నానంచేయాలి, ఉంచిన చీకటి మాటలతో.
No comments:
Post a Comment