యీ కాస్త మిగిలిన చినుకుల చీకటి సమయం చాలు
యే దారేలేని నిశ్శబ్దం ప్రయాణించటానికి
చప్పుడు కావాలి
ఓ మౌనమైకంలో జీవించాలంటే
రోదించే ఏ దూరమో
నీలో ఎప్పటికీ రాదు
భయం కావాలి ఏ కలకైనా
ఏదో నవ్వులేని నవ్వు నీలో
ఎప్పటికీ ఎవరికీ చెప్పవు
పదాల మధ్య కిటికీలోంచి
నీ కిటికీని ఎవరైనా తెరిచారా
తెరవకు నువ్వైనా
శరీర నాణెం
శరీర దానం
శరీర జ్ఞానం
తెరుచుకోలేని రాత్రి నీలో
దహనమే అవ్వదు
ఇక ఎటూ చూడకు
నీ నేత్రాలు నీవి కావు
తొక్కుడుబిళ్ళ వాక్యాలు కింద ఎగిరే
మనసులేని చీకటే నీకొక చినుకైతే చాలదా
వొక స్థలంలోకి
యే నీడ ఏ నీడలోకి చేరిందని
No comments:
Post a Comment