Followers

Monday, December 28, 2015

ఊపిరి గది


పదాల్లో జ్ఞాపకాల్ని దాస్తాను
నేనో పగలని అండాన్ని

చేరే దృశ్యం మరో మాట 
చేరని నేత్రం మరో ఆట 

గాయాలపై గాలిని చూడాలి 
రంగులీనే మనసు వూపిరై 

కోరుకో 
కనుపాపలో పెరిగే ఆఖరి శ్వాసని 

చేతలుండవు 
ఆలోచించే అవలోకనంలో 

వినలేను 
వినే దుఃఖశ్వాస 

కాస్త సైగ చేసే ఊహ 
ఏ నీడో 

తృప్తిలేని చీకటి 
తూరుపులో 

గడియతీయ్ 
గది మూయటానికి 

శ్వాస


నీడల నిదుర  వెదురు గాలిలో 
ఉన్నపళంగా తోవ దొరక్క

తెలియని బోసి పెదాలు 
నమ్మని అద్దాలు 

నిష్కపట కృతాంతుడా
నీ గది బైట నిలబడింది నువ్వేనా 

ఊరడించే అపరాధాలే ఆధారం 
లోహవాయువు ఆరాధనలో 

లోభీ!
కళ్లపై కలల కనికట్టు అట్టిపెట్టు 

ఒంటె పాదాల నేత్రాలతో 
నాలోకి రా 

ముసుగు తెలుపు

ఎదురు చూస్తాను
చూడాలనుకునే ఎదురు చూపు ఎక్కడ
తీరం తలుపుల మధ్య నలిగిపోయాను
శ్వాసించని నక్షత్రంతో
మలుపు తెలియని అక్షరమే
ఓ దేహం
నీ నేత్రం నాది
నాది కాని నేత్రం నాలో
తెలుపు ముసుగు
ఆత్మాక్షర దహనం
అందిన అక్షరాల ఆకారం
అంధ మౌన మోసం
నగ్న శాంతి
నమ్మకం లేకే విశ్రాంతి
తప్పుకు తిరుగు


నిద్ర ఎక్కడ


పదాల్లో ఏముందో
ఎవరికి తెలిసింది

వ్యాకరణవ్యంగవ్యాకులత
విలాసవిశేషవిషం
విడవలనివినమ్రవికృతప్రేమ

అసలే లేదు
అక్షరాల్లోపల

నేత్రాలు
స్వప్నసుగంధాలు
ఎవరి వాసనో

అక్షరాల
అతిశయం
ఎవరి నరమో

తడిచిన వెలుగు ఏది
అసలు మిగిలిన నీడ ఎక్కడ

అసలు
మౌనం, అవమానం, శృంగారం
ఉన్నాయా

అవని
అవనికి
అడ్డం అద్దం ఎక్కడ

అసలు
నిద్ర

అసలు
కల

ఎక్కడ

తిరిగిరాని తర్వాత


తలదాచుకునే అక్షరంలేక
తలనరుక్కోలేను

తలపోతలేక పోతపదాల
తలమీసాల ముఖంలేక

తలకిందులయ్యే తాత్పర్యాల
తలం

తాడోపేడో
తీరిక గతం రాదు

త్యాగ అంగం
తలలో

తూరుపే
తడిలేని తడిక

తాకకు మాటల సువాసనలని

తప్పుడు సంకేతాల సంబరం
తొక్కకు తోకల నీడల్ని

తోడు
తిరిగిరాని తర్వాత

వొదిలి


నేలపై కొన్ని ఊపిరులు తిరిగాయి
కంటిపై కొన్ని కలలు మెరిసాయి

నీతో ఉండని జ్ఞాపకాలే
దయతో నాతో తోడుగా

దూరమవ్వని కన్నీళ్ళు
కనిపించే ఆకాశం

స్వచ్ఛమైన సంతోషం
నీతో తీసుకెల్లావ్

ప్రశ్నలే మిగిలాయి వడలి
జవాబులే పలకవు వొదిలి

తీరం వృధా


ఒంటరినే

మహిమేదో 
చెంతగా

అల్లాడే
మనసే మాటల్లో లేదు

ప్రయాణించని నేత్రం
స్వప్న ఛాయ

కాస్త పిచ్చితో మరో శ్వాసలో
కాలం వాకిలే లేక

పాషాణ ఆషాడం చిలిపి సిగ్గుతో
యెదలో నీటి పుట్టుమచ్చ

చేరే జీవితం, చూడలేను
విరిగే నీడే, హత్తుకోలేను

రంగుల్లో నిలవని నీడలు
పెదవుల పడవుల్లో తేలక

కనువిడిచిన తీరం
ప్రేమ తాకదు

వాక్య నేత్రం


తెలియని దీపం
తెరవని దీపం

మెడలొంచుకునే తీరం
నీటి కన్నుతో

జారని నిప్పులో
ఓ ఇంద్రధనుస్సు

చెలిమి లేదు
చిగురాకు చివర

చింతన అసలే మసలదు
చివుక్కుమనే అశ్రువే వదలదు

హృదయం ఓ దయలేని
వాక్య నేత్రం

చేరనీ
చరించే స్పృహల సమాధిలో

శ్వాసద్వార స్వప్నాల్నే

ఆత్మా అమ్మా


తెరుచుకోలేను తెరవని తాత్పర్యాల్ని
తెరిచే తప్పుల్ని

అదో పురుష ప్రశ్న
ప్రశ్నే స్త్రీ దేహం

తగ్గిన చినుకు
విరగని ఎండ

దాపరికాల పరిచయాలు
స్నేహం ఓ మూస ద్వేషం

విత్తనాలు లేవు

గుడిలేదు
గడిలేదు
గురుతులేదు

గర్భరేఖ సుఖం
స్పర్శలోకి రాదు

నీదో ముఖం
పరాయి దుఃఖం

ఆత్మ కురూపీ
అమ్మలో అమ్మతో మాట్లాడలేను

ఆత్మా అమ్మా
శరీరాన్ని వొదులు

తండ్రీ 
నువ్వో తీరికలేని శత్రువు

తడవని కన్నీరే


తెరవని ఖాలీ కాగితం
అక్కడెక్కడో కొంత జీవితం

చూడని నేత్రాలే
నేత్రాలే చూడవు

వెళ్ళవు శ్వాస సువాసానలో
నిర్గమ మృతపదాలు

శాంతి రహస్యం
చంద్రుడికే సూర్యుడికే

గాలే కలలో రాక
మనసే శూన్య పుష్పవిక్రాంతి

అడగొద్దు
నేనో దొంగనని

కలవని గాలే
దాయకు

దేహం ఓ జాడలేని శిల్పం
నిద్రే దూరమ్

ఫలించని స్వప్నాలే
సూర్యప్రాణం

తడవని కన్నీరే
ఎల్లప్పుడూ

నాచు నిద్ర

యిదేదో సమయించు సమయం 
అనివాస పుష్పయంత్రం

నల్లటి సిగ్గుతో పర్వతాల్లో
ప్రవేశించే నాచు నిద్ర రక్తం

మూయాలి మోయాలి
అదృశ్య నిరీక్షణై

యెక్కడికి తిరిగొచ్చిందో
నేత్రానికి యెప్పటికి తెలియు

కాస్త కానిస్పర్శ కన్నీటిలో మిగిలి మెదిలి
పొడి పొడి అద్దాల్లో కరిగి పెరిగి

తెగిన వేళాకోళాలు

Saturday, August 15, 2015

) “-? :తె, లు.! సా; ’’ (

తమకు
స్వర్గ ఛాయ –
మరి
మలుపు;
( ),
పోనీ
వి:
శ్రాం?
తి’’ తీ
*
యి
చ
ట
మీరా...
నీడా
వివస్ర్త(
*
లో
కాకుల
లో
*
డినోమా
*
కాకూడదెన్నడూ‘‘
*
పవనం
వొక నైరూప్య
జ(ల)గం‘
)కం)
*
‘
క
వనం
దాని
హస్త ’యోని;
*
తొలి
మస్తిష్క సంబంధి
*
చషక బందీ
మలి
నం
...............
*
సుదీర్ఘ కవితా
*
)ఎం ఎస్ నాయుడూ
*
అనంతూ(
...............
15.తూచ్.15()

Friday, August 14, 2015

క్షమాపణ

కంటి కుబుసం కరిగించి 
నాలుకలోపల దాచి వొస్తుంటే 

శిధిలాగ్నికీలల్లో దగ్దాశ్రువు
ప్రతిబింబ ప్రదర్శనశాలలో

మిత్రమృత్యువు 
వెతుకుతుంటే 

తాత్వికత రాదు 
మిణుకులీనే అంధకారస్పర్శ 

కష్టమైన ఆహ్వానం 
ప్రేమ 

ఆనందం 
అవిశ్వాస వ్యసనం 

నువ్వు నవ్వు నీలో 
చెదిరిన కన్నీటికై  

Sunday, January 11, 2015

తిరిగి చూడని అద్దం

దారం లోపలి నీడ 
కన్నెప్పటికి తెరుస్తుంది 

పదాల ఇంద్రియాలతో 
వాక్యాల్ని తెరిచే జ్ఞాపకాలు 

పిరికివాళ్ళతో 
సూర్యాస్తమయాల్ని వృధా చేయాలి 

రాత్రుల్ని మోసగించాను 
చూడని రాత్రికోసం 

అశాస్వత స్పర్శలు 
నిశ్శబ్దాలు, స్త్రీలు తెలిస్తే 

తిరిగి చూడని అద్దం 
చూడాలనుకున్న అద్దం ఏది 

అక్షరాల్లోని పెదాల్ని ముట్టుకునేలోపే 
వృద్ధాప్య సౌందర్య సువాసనలు 

Monday, January 05, 2015

లేమి

అద్దాలు 
అక్షరాలు 
అనుభవించే శరీరం లేదు

నీడని 
నీటిని 
తాకే నేత్రం లేదు

శబ్దాలు 
మౌనాలు 
దాటే మనసు లేదు

శోకాలు
నవ్వులు 
దాచే వాక్యం రాయలేను

ఎన్నటికి ప్రేమిస్తాను 
విరిగిన కలల్ని 
తెలియని పదాల్తో

వొదిలెళ్ళే జ్ఞాపకాల్ని 
ఎప్పటికీ మన్నించను

తీరిగ్గా నిద్రపోవాలిక

Wednesday, December 03, 2014

నగ్నసమాధి


నల్లటి ముఖాలపై నల్లటి నవ్వుల కురుపులు 
కడుపులోని నల్లటి కలలపై నువ్వుల మెరుపులు 
మెడలోని కణితి కంటిలోకి సూర్యుడి చినుకులు 
తొడలోని తోకకి తామరాకుల నీడలు 
చనిపోయాక కూడ ఏమి చదువుతారు 
రాయటానికి అక్షరాలేమైనా నగ్నసమాధులా 

Sunday, October 19, 2014

శ్వాస

నీడల నిదుర  వెదురు గాలిలో 
ఉన్నపళంగా తోవ దొరక్క

తెలియని బోసి పెదాలు 
నమ్మని అద్దాలు 

నిష్కపట కృతాంతుడా
నీ గది బైట నిలబడింది నువ్వేనా 

ఊరడించే అపరాధాలే ఆధారం 
లోహవాయువు ఆరాధనలో 

లోభీ!
కళ్లపై కలల కనికట్టు అట్టిపెట్టు 

ఒంటె పాదాల నేత్రాలతో 
నాలోకి రా 

Tuesday, April 29, 2014

మౌనద్వారం

ఆకస్మిక cosmic చిరునవ్వు
నిన్నే ఎందుకు ముద్దుపెట్టుకుంది 

దుఃఖకౌగిలి వ్యాకరణంలో వాత్సల్యవాయువు 
నిన్నే ఎందుకు చుట్టుముట్టింది
వ్యసననయనాలతో అశ్రువులు 
నిన్నే ఎందుకు చూశాయి
నిర్జీవమైన పదాల్లోకి
నిన్నే మనసుశ్వాస ఎందుకు ఊపిరితీసుకుంది
రంగుల్లేని గాలి 
నిన్నే ఎందుకు పిలిచింది నిర్బింబ అశూన్యంలోకి
ఇక కలవరపడకులే... 
రేయింబవళ్ళు లేవు 
భగవంతుడు లేడు 
శబ్దాలు లేవు 
కన్నీళ్లు లేవు

నీ స్నేహపు దారి 
ఎందుకు మూసేసావు యకాయకి 

                                                                  - రామిశెట్టి విజయకృష్ణకి

Friday, April 04, 2014

గాలిని మింగాను

కావాలనే కదూ 

కల ఇవతల చనిపోయావు 



కలవలేని కలపలేని 


కన్నీటి కనికరం


ఎందుకులే 



సువాసనే 


దుఃఖంది 



హత్తుకున్న ఖాళీ 


హృదయం ఏ ప్రేమదో 



కోరిన కోరిక 


కానుకై వస్తే 


అది మనసుశ్వాసే 



నిద్రలేక గాలిని మింగాను

Thursday, April 03, 2014

మృగమౌనం

bathos or pathos

కొన్ని అంతే మింగుడు పడవు
పడుపు పడవల వలల పడవ కడుపు అంతే 
అంతా ఓ అల
ఓ మృగమౌనం

తెరవని తలుపు తెలుసు
తెరిచినా తలుపులోని తెర తెలియని
గాలి గాజు మిగిలి

పారదర్శకత ఓ వ్యసనం