కంటి కుబుసం కరిగించి
నాలుకలోపల దాచి వొస్తుంటే
శిధిలాగ్నికీలల్లో దగ్దాశ్రు వు
ప్రతిబింబ ప్రదర్శనశాలలో
మిత్రమృత్యువు
వెతుకుతుంటే
తాత్వికత రాదు
మిణుకులీనే అంధకారస్పర్శ
కష్టమైన ఆహ్వానం
ప్రేమ
ఆనందం
అవిశ్వాస వ్యసనం
నువ్వు నవ్వు నీలో
చెదిరిన కన్నీటికై
No comments:
Post a Comment