Blog Archive

Followers

Sunday, July 10, 2011

వణుకు

మహాప్రభో!

చూపు మందగించి

సూదిలోకి దారపు మాటల్ని
ఇటునుంచి అటు ఎక్కించలేక
పదాల్ని గుచ్చలేక

ఈ పూట కూడా నీకు విడి విడి

అక్షరాలతోనే నిన్ను అలంకరిస్తాను

బుద్ధి మందగించేలోపు

ఓ చిన్న దండైనా
నీకు అర్పించే శక్తినివ్వు

1 comment:

Anonymous said...

WOW. thats a great poem Naidu. I would say, this is one of your best.
...