నీటి నాలుకని తవ్వుకోవాలి
నదిలోపల ఇసుక పువ్వులు
చుట్టబెట్టే వరకు
మాటల వలయాల
ఊబి ఎంత
గూడుకట్టలేని సాలీడులోకి
నడిచే కళ్ళతో వెంబడించాలి
అనుమతి ఉండని నిద్రకి
నిద్రించే దేహం ఎందుకు
కాలపు నకలు ఎక్కడ
నాలుకలోకి సూర్యుడు
రాత్రి మధ్యలోని నది
నదిలోకి మునిగిపోయింది
పారిపోయే గాలే
అనాధ
తవ్వుకోవాలి నాలుక నీటిని
1 comment:
ఊబి నుండి బయుపడాలనే తీరని దాహం తీరేదెన్నడు
Post a Comment