Blog Archive

Followers

Monday, January 31, 2011

కాలపు నేత్రమెక్కడ

తలదాచుకున్న కన్నీళ్ళని
చెదరగొట్టకు
\
కారాగారపు రాత్రికేం తెలుసు
చంద్రుడి విన్యాసాలు
\
మూత్రిస్తున్న సూర్యుడికీ తెలియదు
స్వప్న ప్రేమలు
\
కూతురితో మాట్లాడే
తండ్రి మౌనమే అర్థమవ్వదు
\
నీళ్ళే కావాలా
కన్నీటి చూపుని శుభ్ర పరచాలంటే
\
ప్రతి దృష్టీ
ప్రమిద శ్వాసే
\
దేహం
మనసు
ఎప్పటికీ విలువలేనివే

2 comments:

srikanth said...

చెదిరిన కన్నీళ్ళని
నిదురపుచ్చకు
/
చంద్రుడు లేక రాత్రీ
విన్యాసాలు లేక
కారాగారాలూ లేవు
/
మూత్రిస్తున్న ప్రేమలకి
సూర్యుడి ప్రేమ తెలీదు
/
తండ్రి శబ్దం
కూతురి నిశ్శబ్దం
మౌనానికి
మౌనం అర్థం కాదు
/
కన్నీటి కడగంటి చూపు
నీతో
పరిశుబ్రమయ్యాయి
/
ప్రతి ప్రమిదే
నీ శ్వాస దృష్టే
/
విలువ, వలువ
రెండూ
రెండుగా లేవు

మనస్సుకీ
దేహానికీ
8

srikanth said...

check the notion of Wreading over the net. :-))