పనిరోజుల్లో చలి.
సరైన దుప్పటీ లేదు.
నిద్రెక్కడ.
___
రైలు కూత.
ఎవరి దూరమూ
ఎవరికీ తెలియనివ్వదు.
___
అనవసరమైన పదాలు.
పదాలతోనే అనువదించాలి.
___
హోటల్ తిండిలో
వెంట్రుక.
ఇంటికి ఎపుడెలతానో.
__
అప్పులే
సంవత్సరాల తరబడి
ఆదాయమే రోజుల్లో.
__
తీరిక లేదు.
నిను చేరే
మాటలూ లేవు.
__
ఇది ఏ రాత్రి.
రాత్రైతే రాత్రికీ తెలియదు.
హాజరు పట్టిక ఎక్కడుంది.
__
ఆహారం, ఆహ్లాదం
పొందటానికి
ఎంత అహంకారం కావాలి.
No comments:
Post a Comment