కొన్ని తెల్లటి మాటలు
అక్షరాల్ని తెలుపుతూ నలుపుతూ
పదాల పల్చటి పాదరసం గాలిలో
కనుమూయని నీటి పాదముద్రలు
కనుగొనని అంతిమ స్వప్నానికై
కడసారి కరచాలనం చేశాయి
రెక్కలూడిన గాలి
విరామచిహ్నాల శ్వాస
వీడ్కోలు వీధిలో
దీపం లోపల దీపం
మడతలులేని నీడలు
ముడతల మౌనం
హాజరు
గైర్హాజరు
మృత్యువు
స్మశాన దర్పణం
దుఃఖితుల రూపురేఖల్లో
ఖాళీ జ్ఞాపకాలు
కొన్ని నల్లటి మాటల కట్టెలు
వాక్యాల్ని విరుస్తూ పేరుస్తూ
మునుగుతూ తేలుతూ పదాల నీటిలో
గాలి దాక్కుంది
నా నుంచి
2 comments:
నాయుడు, పద్యం చాల బాగుంది. రెండో చరణంలో తలుపుతూ, నలుపుతూ లకు సఫురించిన రెండర్థాలతో పద్యం రెక్కలు విప్పింది. వేదన స్పృహ కడదాక నిలిచి, నన్ను నాతో వదిలి వెళ్లిపోయింది. (మొదటి చరణంలో నూ మరోచోట తెల్లటి, నల్లటి అనే పదాలు లేకపోతేనే బాగుండేదేమో!)
thank you sir.
Post a Comment