కంటిలో వొదిలిన పక్షులు
యెగిరి వొచ్చే వేళైంది
వెళ్లిపో
కళ్ళల్లో కలలు
కనుమూసే సమయమైంది
వెళ్లిపో
నగరం నడిబొడ్డున
స్మశానం నిద్రలేస్తోంది
వెళ్లిపో
పసిపిల్లల బొమ్మలు
ప్రాణం పోసుకుంటున్నాయి
వెళ్లిపో
రక్తపు కొండలపై
వర్షం గడ్డకడుతోంది
వెళ్లిపో
వానపాముల నిద్రలో
పైరుపంటలు పురుడుపోసుకుంటున్నాయి
వెళ్లిపో
ఋతువులు వృద్ధాప్యంలోనూ
నక్షత్రాలని వెంబడిస్తూ ఉన్నాయి
వెళ్లిపో
అక్షరాలపై వేలిముద్రలు
కనుమరుగవుతున్నాయి
వెళ్లిపో
4 comments:
వెళ్ళిపో need not be repeated.
కంటిలో వొదిలిన పక్షులు
యెగిరి వొచ్చే వేళైంది
కళ్ళల్లో కలలు
కనుమూసే సమయమైంది
నగరం నడిబొడ్డున
స్మశానం నిద్రలేస్తోంది
పసిపిల్లల బొమ్మలు
ప్రాణం పోసుకుంటున్నాయి
రక్తపు కొండలపై
వర్షం గడ్డకడుతోంది
వానపాముల నిద్రలో
పైరుపంటలు పురుడుపోసుకుంటున్నాయి
ఋతువులు వృద్ధాప్యంలోనూ
నక్షత్రాలని వెంబడిస్తూ ఉన్నాయి
అక్షరాలపై వేలిముద్రలు
కనుమరుగవుతున్నాయి
వెళ్ళిపో
If ur poem had been with one వెళ్ళిపో like above, it might be more appealing. Nevertheless, the repetition of వెళ్ళిపో also be construed as attaining lyrical beauty to the poem.
A good poem.
- naresh Nunna
thank you.
నరేష్ గారూ..
మీరన్నట్లు అది లిరికల్ బ్యూటీనే. అంతేకాక అది కవి కావాలని పెట్టినట్లు లేదు. అది (రిపిటీషన్) లేకుండా ఉండటం కూడా లోపంగా అనిపిస్తుంది. (అంతకుముందు అది ఉందని తెలియకపోతే తప్ప) కేవలం అర్థాన్న్నే చూడలేం కదా. రిపిటీషన్ పాటకు అందమైనట్లే కొన్నిసార్లు అది కవితకి అందం, అవసరమూ అవుతుంది. కవి ఉద్దేశ్యం కూడా more stress అనేమో ..
కవిత బాగుంది... both ways, with one వెళ్ళిపో and రిపిటీషన్.
Post a Comment