Blog Archive

Followers

Thursday, July 15, 2010

మా రాక్షసుడా!

నువ్వెప్పుడూ రాక్షసుడవే

పునరావృతమయ్యే ప్రతి సంఘటనలో

నీ అసలు రూపం ఎందుకు మారదో
అర్థం చేసుకుంటూనే చస్తున్నాం

మేము చచ్చినా నీ నిజస్వరూపానికి

సిగ్గనేదే ఎందుకు రాదో
అర్థం చేసుకుంటూనే చస్తూ బతుకుతున్నాం

నువ్వెప్పుడూ గ్రహాంతర రాక్షసివే


ఏ పాలూ తాగకుండా పెరిగినందుకేనా

ఇపుడు మా రక్తాల్ని తాగుతున్నావ్

నీలా బరితెగిస్తే

మా ఊపిరి ఉన్నంతవరకు
నువ్వెక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా
నిన్ను తరిమి తరిమి పైకి పంపమూ

నువ్వెప్పుడూ నపుంసక రాక్షసుడవే


నీ అంకిత భావాలకి

నీ కర్తవ్య సాధనకి
నీ ప్రేమపాత్రుల ఊడిగానికి
నీ అసలు రంగు బైటపడేలోగా
ప్రజా రక్షక రాక్షసుడిగా వేషం మార్చేయ్

ఇక నువ్వెప్పుడూ

అతి విశ్వాస శునక రాక్షసుడివే

మేమే కదూ

నీ శీలాన్ని చెరచంది

మేమే కదూ

నీ ప్రతిషట్టల్ని ఎగతాలి చేయంది

మేమే కదూ

నీకు అన్నంపెట్టి తిరిగి కాటు వేయించుకుంటున్నది

నువ్వెప్పుడూ త్రికాల సంరక్షక రాక్షసుడవే


మా మందబుద్ధి ప్రాణాలతో

నీ చెలగాటం ఇంకెన్నాళ్ళు

2 comments:

b.ajay prasad said...

నాయుడూ
ఇది నువ్వు రాయవలసిన కవిత కాదేమో. ఇలా రాసేందుకు చాలామందే ఉన్నారు తెలుగులో (అలా రాసేవాళ్ళమీద అగౌరవం ఏమీలేదు నాకు). కానీ నీలా రాసేవాళ్ళు లేరు.నీలా రాయగల మరొకరుండటం కూడా తప్పే అవుతుంది. ఎవరి ధోరణి వారిదవడం మంచిది. నీలాంటివాళ్ళు అరుదు. నీ ధోరణి వేరు.

సందర్భం అదే అయినా, దాని గురించి నీకు రాయాలని అనిపించినా, ఆవేదన అయినా, ఆత్మహత్య అయినా అందులో నువ్వు కనిపించాలి కదా. ఈ కవితలో నాకు నువ్వు కనిపించలేదు. నువ్వు కనిపించకున్నా కనీసం అది (సందర్భం అనుకుందాం)కూడా ఈ కవితలో కనిపించడంలేదు. ఇంతకుముందే చెప్పినట్లు నేను మంచి కవిత్వ పాఠకుడిని కాను. తప్పుగా అనిపిస్తే మన్నించు.

అభినందనలతో
అజయ్ ప్రసాద్

Hanumantha Reddy Kodidela said...

అజయ్ ప్రసాదు గారి అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఒక మాట. నాయుడు ఇలా రాయొద్దు. నిజానికి నాయుడు 'ఇలా' రాయలేకపోయాడు కూడా. అలాగని నాయుడు మొన్న ఎలా రాశాడో అలా కూడా రాయనక్కర్లేదు. కవి ప్రతిసారీ తనకు తాను చచ్చిపోయి పుట్డడానికే ప్రయత్నించాలి. ప్రయత్నం... విఫలమయినా అందంగానే వుంటుంది.