నా బయట కొన్ని అచిత్రాక్షరాలు
నీ లోపల మరికొన్ని అక్షర చిత్రాలు
ఎవరి సంకేతాలు ఎవరికి చేరతాయి
చేరని సంఘటనలు ఎవరివి
ఎవరెవరి కోసం
సంజ్ఞల నిశ్శబ్ద స్పర్శ
స్పర్శల సంకేత నిశ్శబ్దం
ఎవరిని వెతుకుతుంది
యధాతథ యథార్థాల్లో యాత్రించే
యముని యశస్సు యెంత
ప్రతిదీ ఒకానొక చిత్ర వ్యక్తీకరణ
అవ్యక్త చిత్ర పదాల్లో నిజమెంత
పదాల అనుభవంలో నిజం ఉందా
లిపిలేని ఆలోచనలనే అనుభవిస్తున్నామా
ముడిపడని ముడివిడవని మాటల అనుభవం ఏమిటి
ఖాళీ లేని శూన్యం
ప్రవేశించే పదాల ఖాళీలో అనుభూతి యెంత
తిరిగి పలకని కల
నీ లోపల మరికొన్ని అక్షర చిత్రాలు
ఎవరి సంకేతాలు ఎవరికి చేరతాయి
చేరని సంఘటనలు ఎవరివి
ఎవరెవరి కోసం
సంజ్ఞల నిశ్శబ్ద స్పర్శ
స్పర్శల సంకేత నిశ్శబ్దం
ఎవరిని వెతుకుతుంది
యధాతథ యథార్థాల్లో యాత్రించే
యముని యశస్సు యెంత
ప్రతిదీ ఒకానొక చిత్ర వ్యక్తీకరణ
అవ్యక్త చిత్ర పదాల్లో నిజమెంత
పదాల అనుభవంలో నిజం ఉందా
లిపిలేని ఆలోచనలనే అనుభవిస్తున్నామా
ముడిపడని ముడివిడవని మాటల అనుభవం ఏమిటి
ఖాళీ లేని శూన్యం
ప్రవేశించే పదాల ఖాళీలో అనుభూతి యెంత
తిరిగి పలకని కల
1 comment:
Hi
welcome to my blog
gsystime.blogspoto.com
read my blogs for spiritual information and intent of knowledge.
*క్షణం - అంతా తెలిసిపోయేనా (jan-10)
* ప్రకృతిగా పంచభూతములు ఎలా (feb-10)
Thanks
Nagarju
నా రూపమున ఒకే క్షణమున నవ్వు జాలి కరుణ దయ ఉత్సాహం ఆత్రేయం ప్రేమ ఏడుపు భాద వేదన చింతన -
కోప తాప ఉక్రోషాలు ఉగ్ర రాక్షసత్వ రోష ఉగ్వేదాలు క్రూర ద్వేష ఆకార వికారములుగా ఎన్నో రకాలుగా నాలో -
కనపించేవారికి చూసినట్లుగా ఒకే భావమైనా నాలో తెలియని స్వభావ ఆకృతులు ప్రతి క్షణమున ఎన్నో విధాల -
ప్రతిజీవిలో ప్రతిఅణువున కలుగు స్వభావ ముఖ కదలికలు నాలో నిరంతరం దాగేఉండును మరణ రూపమైనా -
Post a Comment