ఏదో సొంత వింత చీకటి
చెట్లు పెరుగుతుండే సముద్రపు చీకటిలో
నీ వంక నువ్వు చూసుకుంటావు
ఎన్నో వస్తువుల మధ్య మరో వస్తువు
నీలోకి చూసుకుంటావు
మాటలన్నీ మాగిపోయాక
ఆగిపోయాక నీతో మాట్లాడాలని అనుకుంటావు
ఏదో చీకటి వింత
నిన్ను నువ్వు వినాలనుకుంటావు
ఏదో
చీకటై చితికి
ఎక్కడో ఏ యాత్రికుడో
నీలానే రాత్రి సముద్రం వైపు నడుస్తూ ఉండొచ్చు
చెట్లు పెరుగుతుండే సముద్రపు చీకటిలో
నీ వంక నువ్వు చూసుకుంటావు
ఎన్నో వస్తువుల మధ్య మరో వస్తువు
నీలోకి చూసుకుంటావు
మాటలన్నీ మాగిపోయాక
ఆగిపోయాక నీతో మాట్లాడాలని అనుకుంటావు
ఏదో చీకటి వింత
నిన్ను నువ్వు వినాలనుకుంటావు
ఏదో
చీకటై చితికి
ఎక్కడో ఏ యాత్రికుడో
నీలానే రాత్రి సముద్రం వైపు నడుస్తూ ఉండొచ్చు
4 comments:
ఇదేదో నేనే రాసినట్లుంది
నా గురించి రాసుకున్నట్లుంది
ఎక్కడికో వెళ్ళిన నా నీడ ఇక్కడికి తిరిగొచ్చి
నాతో మాట్లాడినట్లుంది
నేను తిరిగిన నిర్మానుష్యపు సాయంకాలాలు
అలవోకగా అస్థిమితంగా పొర్లిన ఇసుకమేటలు
చిక్కటి చెట్ల ఆకుల నీడలు
గోధుమ రంగు ఎండ
ఇదంతా నా నిద్రలో
చెట్లు పెరుగుతుండే సముద్రపు చీకటి
i liked it
బాగుంది. అనానిమస్ అన్నట్టు ఇది అందరి సొంత చీకటి.
thank you anon, jagdeesh and hrk ji.
Post a Comment