ఒక గాలి నిండిన కాయితాన్ని చించు
చించిన పదాలు కింద పడొచ్చు
చిరిగి పడిన పదాల్లోకి నీ కళ్ళని పంపు
వెతికే వెలితీ, వెలితిని కనుక్కునే వెలితీ కనిపించొచ్చు
మాట్లాడు కాయితపు నాలుకతో
పూర్తవ్వని అక్షరాలు పూర్తయ్యే అనాకార అక్కరాలు
అదే చీకటి మౌనం
అదే మౌన నిశీధి
చెవుల్ని ఎడంగా పెట్టు
కన్నీళ్ళనీ ఎడంగా పెట్టు
గాలిలేని గాలి కాయితాన్ని తీసుకో
నీ పదాలతో నింపు, చింపు
ఏమి చూసావో రాయి
నీ గాలి కాయితంలో
7 comments:
నీ కవిత బాగుంది. సందేహం లేదు. నీ కవితల నిండా దారిలేని వాక్యాల దగ్గరే నిలుచునిడిపోవడమో, చెప్పబోయే పదాల దగ్గరే ఆగిపోవడమో జరుగుతూ ఉంది? నువ్వు అక్కడే నుంచుండిపోయావా.. ప్రవహిస్తున్నావా? ఇంకాస్త లోపలికి వెళ్ళడమో బయటకు రావడమో ఉంటుందా? ఇటునుంచి నీ దారెటు? ఎటునుంచి? సరే..సరే. నీ అక్షరాలకు రంగులే లేవు. గాలీ, శూన్యమూ లేదు. వేళ్ళమధ్య పదాల వృధాను ఎన్నిసార్లని ఋజువు చేస్తావు. ఎటుతిప్పి చూసినా ఈ శవం ఎండిన కట్టె. ఏ ఖాళీలోకి చూసినా ఇటే కొట్టే గాలి. అద్దం చూసుకునే అట్టలు కట్టిన అక్షరాలు. సమాధుల చుట్టూ తిరుగుతూ ఎన్నిసార్లని కలవరిస్తావు. అది సరే. నువ్వెటు వెళ్తుతున్నావా అని ఇక్కడే కూర్చుని చూస్తున్నాను. చీకటిలో ఒక కన్ను దిగంతం దాటింది. ఉదయం ఒక కన్నులోంచి బయటకు వచ్చాను. అయినా నువ్వెటు వెళ్తావా అని ఇక్కడే నుంచుని చూస్తున్నాను.. దాటిపోయే నీడలను చూస్తూ....
dear naidu...just now read the comment of Anonymous after our mobile conversation...whatever it is....Comment of this Anonymous itself is like a poem....just say thanx to the Anonymous....
Dear Naidu!....I have seen the old postings & the old comments of 'Anonymous'...then I understood the problem...but, my point is why u suddenly called and asked me about this 'anonymous'?....Hope, I would get a honest reply....Good Luck
Hi Koduri. Thank you for your comments. I didn't suspect you as anonymous and rang you up just like that. Yes,,, anonymous comments at times are poetic and at times apoetic. For my apoetic writing, i deserve those comments. No change in writing. Still, discovering to know and write a poem.
dear koduri
there is no single anonymous in this blog. they are different.
@Naidu.....thanku for your sportive response....like many others, I too, am a fan of ur poems... @Anonymus....thanx for the clarification
శూన్యాస్తిత్వపు
సాహిత్య నిలకడతనాన్ని
బాగా చెప్పారే
Post a Comment