Followers

Saturday, August 28, 2010

కాలం || కాయం

ముడుచుకుపోతున్న పదాల శరీరం || వివరించని ఆంతరంగిక జిహ్వ || అనాధ వాక్యాల్లో విరక్తి విషం ||కాటికాపరి ఎదురుచూపు || ఆశల నిషా || శాప శాంతి || నిరాకార దహనారంభం || నవ్వే చీకటి || కన్నీటిపై ఎగిరే సీతాకోకచిలుక || సముద్రపు నీడ || మూత్రపిండాల గాలి || వల || స్పర్శ సర్ప సూర్యుడు || వెన్నెముక విత్తనాలు || ఉత్తుత్తి ఊపిరి ఉయ్యాల || బంధించే బాధలు || కలల రాకపోకలు || తెగవు || ఆఖరి ఆలస్యం || ఊహించని అహింస || నీడల్ని వింటున్న నీడలు || అక్షరాలు వైపు అడుగులేసాయో || వాక్య శ్వాస చెప్పదు || ప్రేమించే అంధకార స్పర్శ || స్మశాన గర్భం || రహస్య స్వర్గం || అపూర్ణ వలయం || అసంపూర్ణ మరణం || మనసు మూత్రం || కల నాలుక || వడలిపోయిన కుబుసం || కరుగుతున్న అద్దం || రక్తంలేని శ్వాస || మాట్లాడని మనుషుల మాటలు || నాచు పట్టిన గాలి || ఒక్కసారే || ఎముకల కలలో భగవంతుడు || చోటులేదు || వర్షంపై వర్షం || రాత్రి వొదిలిన చీకటి || అర్థరాత్రని తెలియని చావు || మూట || నవ్వని కనుపాప || ఓదార్పు || హస్త ప్రయోగం || యోగ యోని || యోచన || నిశ్శబ్ద నిరాలోచన || ఎండుతున్న కన్ను || గాయం || కాలం || కాయం || మాయం || అపవిత్ర మిత్ర చిత్ర మౌన పదం || మృత్యువు || కాలంలోనే ఉంటూ కాలం చేయాలి || కలకాలం || తల్లిదండ్రుల భాష పోతోంది || ఈ-చర్మం కుట్టుకోవాలి || కట్టూబొట్టూ తిరగేసి కట్టాలి || వైరాగ్య అవిశ్రాంతి || సమాధి || మెదడులో ఉమ్మనీరు || తర్ఫీదు పొందని నిద్ర || జవాబులు || నగ్నాస్థికలు || కూరుకుపోతున్ననల్లటి జ్ఞాపకాలు || తేలని తెలుపు తప్పులు || బతికిలేని వాక్యాల్లో శరీరం || గోడలు లేని శవం || మళ్లీ ఎదురుపడలేము నాన్నా...

5 comments:

subhashini poreddy said...

ksp gaaru chanipoyaranaa sir...ee padajaala prayogaalu!! any way...sutiga chadavalante bhayapedutunna padaala kalayika!!

Afsar said...

నాయుడూ:

చాలా కష్టం వెంటనే ఏదయినా రాయడం! ఇది మాటలకి సంబంధించిన విషయం కాదనుకుంటా. మాటల్లో తేలే విషయమూ కాదనుకుంటా. అందుకే, ఈ స్థితిలో ఏమయినా రాస్తే సుభాషిణి గారు అన్నట్టు అవి "భయపెడ్తున్న పదాల కలయిక" లా వుంటుంది.

కానీ, మీరు ఆ ఎంకౌంటర్కి సిద్ధమై ఈ నాలుగు ముక్కలూ మా ముందు పరిచారు.

ఇది వొక శకల చిత్రం.

ఇందులో ఏం వెతుక్కుంటాం?! కానీ, ఆ చీకటీ చితి మసకలో నీడ లాగా కలిసిపోకుండా మీ లోపటి చీకటి మీద కాస్త కాంతి పరిచారు. అందుకే, ఈ పద్యం కాంతివంతంగా కూడా వుందని అది మీలోపలి నించి కూడా దీసుకుంటున్న నిబ్బరాన్ని చేబ్తుందనీ అనుకుంటున్నా.

Hanumantha Reddy Kodidela said...

'మళ్లీ ఎదురు పడలేము నాన్నా...' నాయుడూ, ఈ ముక్తి లేని ఈ బాధలో నేన్నీతో ఉన్నా.

ఎం. ఎస్. నాయుడు said...

మీ అందరికీ నా కృతజ్ఞతలు

nareshnunna said...

The poem is beyond comments and it is above board