Followers

Thursday, October 12, 2017

\\ చూడటమే తెలిస్తే //

వుండాలేమో వున్నట్టు వుంటూ
వుండాల్సిన దేవుడికి దేవుడెక్కడ
వూడిన మాటల్తో మూర్ఛవ్యాధి
మరో మాట చెప్పాలి
మెత్తటి వూహాని చూస్తే
చూడటమే తెలిస్తే
తెలిసి చూడటమంటే యేమిటో...
జంకుతో ప్రకటించే రహస్య జ్ఞాపకాలా
రంగుల్తో రగిలే జ్ఞాన రహస్యాలా
దేదీప్య హృదయగ్రహణంతో
సస్వరూప శాపమై
అవికల స్వప్నాల్లో శ్వాసై
వేరేవేరే అకపట సత్యాలెందుకు
కాస్త చనిపోతే పోలా

No comments: