Followers

Saturday, June 24, 2017

ephemera

సంక్షోభం అసలే రాదు
ఆత్మహత్యలు చేసుకోరు
ఏ చరిత్రకీ బలహీనత రాదు
ఏ మతానికీ బలహీనత రాదు
ఏ సిద్ధంతానికీ బలహీనత రాదు
దారితప్పే సత్యమే ప్రభుభక్తి
భుక్తిభక్తే సత్యాస్థిత్వం
రుణమాఫీ
రణమాఫీ
మరణమాఫీ
లోతట్టు పదాలే
మాడిన అశ్రువులై
వాంతుచేసుకుని జెండాలెగరేస్తాయి
ఆటవిక ఆత్మతో
ఏ లోపలా లేక
ఏ లోపాలు లేక
ఏ లోకం లేక
నాని నాని
కుళ్ళిన మోక్షంలో
జైకొట్టు బైకొట్టు మరో
లజ్జాతీత రోజుకు

No comments: