Followers

Sunday, February 24, 2013

అదృశ్య క్షణం

కల కనిపించక

యింకా నిద్దట్లోనే


నిరాధార స్వీయ సంభాషణనే

తిలకిస్తున్నట్టు తిలకిస్తుంటే

వింటున్నట్టు వింటుంటే


అసూయ ఆక్షర్షణే

యేదో రూపం వొదిలీ వొదలక

కదిలీ కదలక

కలత మాటల లతై

యెవరూ చూడని కళ్లతో

అటే యెగిరి

జీవిస్తామేమో అదృశ్య క్షణంలో



1 comment:

Anonymous said...

సాధారణమైన పదాలు
కఠినమైన భావాలు
అన్నీ మెరిసేవే..
పదాలు వంచుతున్నావా
భావాలు వంచుతున్నావా
అన్నీ మెరిసేవే