ఒకోసారి
ఏ బాధనో దుఃఖంలోకి తీసుకెళ్లటం మంచిదేమో
తోసుకునే నల్లటి చేదు వలయాలు గుండెనిండా నిండినపుడు
ఒకోసారి
ఏ చీకటిచితిలోని తెల్లటిగాలిలోనో మిగిలిపోవాలి
బిగదీసుకునే చల్లటి కెరటాలు కంటిలోకి వెళ్లనపుడు
ఒకోసారి
ఏ రంగులూలేని మోసపు ఆత్మీయతకు బలవ్వాలి
ద్రోహపుకాంతి జ్ఞానాన్నీ వెంబడించే అజ్ఞాతహృదయంలోంచి
ఒకోసారి
పిట్టల కన్నీరులోకి
పిల్లల కన్నీరులోకి మరొక కళ్ళతో చూడాల్సిందే
ఒకోసారి
బిగ్గరగా మౌనంలోకి అరవాలి
మాటలన్నీ ఏ ఒక్క దృశ్యమూ కాకుండా
ఒకోసారి
కలలు స్త్రీలు స్నేహితులు రాచపుండ్లు
Wednesday, September 28, 2011
Tuesday, September 27, 2011
డిస్కౌంట్లో అంత్యక్రియలు
ఇక్కడే
ఈ రోజే ఉచితంగా
మీ రచనలు చదవబడును
మీ జ్ఞానార్జిత సంపదను దొంగిలించబడును
ఫ్రీ ఫ్రీ ఫ్రీగా తీసుకోండి తిరిగి మీ జ్ఞానాన్నే
జ్ఞానవంతులు కావాలని ఆశించండి
ఇక్కడే మరెక్కడా కాదు
డిస్కౌంట్లో దొరికే ఆలోచనలు కొనబడను
డిస్కౌంట్లో ఫ్రెష్ ప్రేమలు అమ్మబడును
డిస్కౌంట్లో ట్రాష్ రచనలు వినిపించబడును
డిస్కౌంట్లో ఫార్స్ సినిమాలు చూపబడును
డిస్కౌంట్లో క్షమాపణలు
డిస్కౌంట్లో అంత్యక్రియలు
డిస్కౌంట్లోకన్నీళ్లు అమ్మబడును
వొచ్చారా
డిస్కౌంట్ పొందండి
పీల్చే గాలిలో నీటిలో నిప్పులో చీకట్లో
ఈ రోజే ఉచితంగా
మీ రచనలు చదవబడును
మీ జ్ఞానార్జిత సంపదను దొంగిలించబడును
ఫ్రీ ఫ్రీ ఫ్రీగా తీసుకోండి తిరిగి మీ జ్ఞానాన్నే
జ్ఞానవంతులు కావాలని ఆశించండి
ఇక్కడే మరెక్కడా కాదు
డిస్కౌంట్లో దొరికే ఆలోచనలు కొనబడను
డిస్కౌంట్లో ఫ్రెష్ ప్రేమలు అమ్మబడును
డిస్కౌంట్లో ట్రాష్ రచనలు వినిపించబడును
డిస్కౌంట్లో ఫార్స్ సినిమాలు చూపబడును
డిస్కౌంట్లో క్షమాపణలు
డిస్కౌంట్లో అంత్యక్రియలు
డిస్కౌంట్లోకన్నీళ్లు అమ్మబడును
వొచ్చారా
డిస్కౌంట్ పొందండి
పీల్చే గాలిలో నీటిలో నిప్పులో చీకట్లో
Monday, September 26, 2011
నకిలీ సమాచారం
అసమగ్ర సమాచారం
దేహంలో కొన్ని మొక్కలు
దేహంలో కొన్ని కిటికీలు
జిగురు, అద్దాలు ఎండిపోవొచ్చు పగిలిపోవొచ్చు
సమగ్ర సమాచారం
మొక్కల దేహంలో
కిటికీల దేహంలో
పగిలిపోయే ఎండిపోయే అద్దాలు జిగురు లేకపోవొచ్చు
ఆచార సమాచారం
భవిష్యత్తులో ఒక్క మృత్యువే నీకూ తెలియకుండా
మృత్యువులో ఒక భవిష్యత్తే నీకూ తెలియకుండా
నకిలీ సమాచారం
ప్రేమించే కన్నీళ్లే శాస్వతం
రమించే జీవితమే శాస్వతం
కామించే మరణమే శాస్వతం
పూజించే భక్తే శాస్వతం
సమాచారం
బానిసలం
బానిసలకి బానిసలం
దేహంలో కొన్ని మొక్కలు
దేహంలో కొన్ని కిటికీలు
జిగురు, అద్దాలు ఎండిపోవొచ్చు పగిలిపోవొచ్చు
సమగ్ర సమాచారం
మొక్కల దేహంలో
కిటికీల దేహంలో
పగిలిపోయే ఎండిపోయే అద్దాలు జిగురు లేకపోవొచ్చు
ఆచార సమాచారం
భవిష్యత్తులో ఒక్క మృత్యువే నీకూ తెలియకుండా
మృత్యువులో ఒక భవిష్యత్తే నీకూ తెలియకుండా
నకిలీ సమాచారం
ప్రేమించే కన్నీళ్లే శాస్వతం
రమించే జీవితమే శాస్వతం
కామించే మరణమే శాస్వతం
పూజించే భక్తే శాస్వతం
సమాచారం
బానిసలం
బానిసలకి బానిసలం
Saturday, September 24, 2011
మనసు
నీ ప్రార్థనకై
పూరేకులన్నీ చేతులు జోడించాయి
అప్రయత్నంగానే
నీ స్నేహానికై
చినుకులన్నీ రెక్కలు విప్పాయి
అప్రయత్నంగానే
ప్రతిచోట నీ శ్వాస
అడుగుజాడలే
ఈదులాడే కాలం
సూర్యచంద్రులని చేరటం లేదు
ప్రేమించే కొమ్మలకే
నీడలు తెలుసు
పూరేకులన్నీ చేతులు జోడించాయి
అప్రయత్నంగానే
నీ స్నేహానికై
చినుకులన్నీ రెక్కలు విప్పాయి
అప్రయత్నంగానే
ప్రతిచోట నీ శ్వాస
అడుగుజాడలే
ఈదులాడే కాలం
సూర్యచంద్రులని చేరటం లేదు
ప్రేమించే కొమ్మలకే
నీడలు తెలుసు
Friday, September 23, 2011
స్నేహితుని స్థలం
సొంత ముఖాన్నే చూసే అయిష్టత
తర్ఫీదులేని అద్దం
ఎన్నో గొంతుకలతో దృశ్యశబ్దాల్ని దాటాలి
నిరీక్షించే సంస్పర్శల మజిలీకై ప్రయాణించాలి
ప్రతిదీ శూన్య వీడ్కోలే
కృతజ్ఞతలు చెప్పేసేయ్ అందరికీ, సమాధీ!
తర్ఫీదులేని అద్దం
ఎన్నో గొంతుకలతో దృశ్యశబ్దాల్ని దాటాలి
నిరీక్షించే సంస్పర్శల మజిలీకై ప్రయాణించాలి
ప్రతిదీ శూన్య వీడ్కోలే
కృతజ్ఞతలు చెప్పేసేయ్ అందరికీ, సమాధీ!
Wednesday, September 21, 2011
తలిదండ్రులులేని స్వప్నాలు
నీ బయట
రాత్రి ఎదురుచూస్తోంది
నిలకడలేని నీడలనీ
కడలి ఒడిలో దాచే పౌర్ణమి
చెట్లపై చీకటి కొమ్మలకీ తెలుసు
చీకటి నీటిలోని చీకటే నీరుకి తెలుసా
వినిపించే నీ బయట
రాత్రి ఎదురుచూస్తోంది
నీ లోపల పెరుగుతోంది
ఒక సన్నటి ఖాళీ పుష్పం
అందుకోవు
తెంపుకోలేవు
తలిదండ్రులులేని స్వప్నాలు
నీ బయట ఎదురుచూస్తున్నాయి
ప్రతిధ్వని ధ్వనినే వినాలనుకున్నావా
ప్రతిబింబ బింబాన్నే చూడాలనుకున్నావా
అదృశ్యమయ్యే
దృశ్యం నీ బయట ఎదురుచూస్తోంది
వెళ్ళావా
రాత్రి ఎదురుచూస్తోంది
నిలకడలేని నీడలనీ
కడలి ఒడిలో దాచే పౌర్ణమి
చెట్లపై చీకటి కొమ్మలకీ తెలుసు
చీకటి నీటిలోని చీకటే నీరుకి తెలుసా
వినిపించే నీ బయట
రాత్రి ఎదురుచూస్తోంది
నీ లోపల పెరుగుతోంది
ఒక సన్నటి ఖాళీ పుష్పం
అందుకోవు
తెంపుకోలేవు
తలిదండ్రులులేని స్వప్నాలు
నీ బయట ఎదురుచూస్తున్నాయి
ప్రతిధ్వని ధ్వనినే వినాలనుకున్నావా
ప్రతిబింబ బింబాన్నే చూడాలనుకున్నావా
అదృశ్యమయ్యే
దృశ్యం నీ బయట ఎదురుచూస్తోంది
వెళ్ళావా
Tuesday, September 20, 2011
ఉయ్యాల నీడల్లో
సిగ్గుపడే
సిగ్గుపడకుండా నా చేతుల్ని కళ్ళని కాళ్ళని నీకు చూపెడతాను
ఎందుకు చూపానో నీకు అర్థమవ్వదు ఎన్నటికీ
ఆకుపచ్చటి చీకటికై
చీకటిలోకి మరలే తెల్లటి చేతుల్ని చాపే చావుకి
నా శరీరాన్ని ఎరువివ్వలేను
పల్చటి నీటి రెక్కలతో బంధించే బాధలకై
వెలుగుని నమిలే వెలుగులో విడిది చేయాలి
నా శరీరాన్నే ఎరువిస్తాను
బరువు రెక్కలతో ఎగిరే పిట్టకి ఆకాశం చులకన
చులకనగా చూసే పిట్టకళ్ళకి ఆకాశం బరువే
రేపటి కెరటాల్లో నిద్రించే సముద్రంలోకి జారుకునే ప్రతి ప్రాణీ
కొన్ని అతుకుల ఇటుకుల ఉయ్యాల నీడల్లో
అతనికీ తెలుసు
ఆమెకై ఎవరూ లేరని
ఆమెకీ తెలుసు
అతనికి తనూ లేదని
తుడుచుకుపోయే కన్నీళ్లే ప్రతి అల తీరం చెంపపై
తీరంలో మన పాదముద్రలు మనకన్నా ముందు నడుస్తుంటాయి
చూసే సిగ్గే
సిగ్గు
సిగ్గుపడకుండా నా దేహాన్నీ ఎత్తుకుంటాను
నన్నే నా దేహం ఎత్తుకోకపోయినా ----
ఎత్తుకునే నా చేతుల్లో
ఎత్తుకునే నా నేత్రాల్లో
ఎత్తుకునే నా కాళ్లో
ఎత్తుకునే నా స్వప్నాల్
ఎత్తుకునే నా మరణాల్
చాలు చాలు చాలు
సూర్యసుఖమేదో
ఈ భూమికే తెలుసు
నాకెందుకులే
సిగ్గుపడకుండా నా చేతుల్ని కళ్ళని కాళ్ళని నీకు చూపెడతాను
ఎందుకు చూపానో నీకు అర్థమవ్వదు ఎన్నటికీ
ఆకుపచ్చటి చీకటికై
చీకటిలోకి మరలే తెల్లటి చేతుల్ని చాపే చావుకి
నా శరీరాన్ని ఎరువివ్వలేను
పల్చటి నీటి రెక్కలతో బంధించే బాధలకై
వెలుగుని నమిలే వెలుగులో విడిది చేయాలి
నా శరీరాన్నే ఎరువిస్తాను
బరువు రెక్కలతో ఎగిరే పిట్టకి ఆకాశం చులకన
చులకనగా చూసే పిట్టకళ్ళకి ఆకాశం బరువే
రేపటి కెరటాల్లో నిద్రించే సముద్రంలోకి జారుకునే ప్రతి ప్రాణీ
కొన్ని అతుకుల ఇటుకుల ఉయ్యాల నీడల్లో
అతనికీ తెలుసు
ఆమెకై ఎవరూ లేరని
ఆమెకీ తెలుసు
అతనికి తనూ లేదని
తుడుచుకుపోయే కన్నీళ్లే ప్రతి అల తీరం చెంపపై
తీరంలో మన పాదముద్రలు మనకన్నా ముందు నడుస్తుంటాయి
చూసే సిగ్గే
సిగ్గు
సిగ్గుపడకుండా నా దేహాన్నీ ఎత్తుకుంటాను
నన్నే నా దేహం ఎత్తుకోకపోయినా ----
ఎత్తుకునే నా చేతుల్లో
ఎత్తుకునే నా నేత్రాల్లో
ఎత్తుకునే నా కాళ్లో
ఎత్తుకునే నా స్వప్నాల్
ఎత్తుకునే నా మరణాల్
చాలు చాలు చాలు
సూర్యసుఖమేదో
ఈ భూమికే తెలుసు
నాకెందుకులే
Monday, September 19, 2011
పుల్లటి నిశ్శబ్దం
ఎవరికి దొరికిందో పిచ్చి నిశ్శబ్దం
ఎవరి చేతిలోనో నిశ్శబ్దం పిచ్చిదైంది
పిచ్చి చేతులో
పిచ్చి మాటలో ఎవరికో దొరికాయి
అందరూ పదిలంగానే
పదిలం ప్రతి నీడా
ప్రఖ్యాతి వీరుడా రా
వీరుడా ఖ్యాతితో రా
మరణంతోనైనా స్వప్నించు
పిచ్చి చావు
చావు పిచ్చి
పదిలం
పదాలే పదిలం
పుల్లటి నిశ్శబ్దం
పుల్లటి పిచ్చి
ఎవరి చేతిలోనో నిశ్శబ్దం పిచ్చిదైంది
పిచ్చి చేతులో
పిచ్చి మాటలో ఎవరికో దొరికాయి
అందరూ పదిలంగానే
పదిలం ప్రతి నీడా
ప్రఖ్యాతి వీరుడా రా
వీరుడా ఖ్యాతితో రా
మరణంతోనైనా స్వప్నించు
పిచ్చి చావు
చావు పిచ్చి
పదిలం
పదాలే పదిలం
పుల్లటి నిశ్శబ్దం
పుల్లటి పిచ్చి
Monday, September 12, 2011
బాహ్య అంతర్మధనం
// ఏది సత్యమో అది జ్ఞానానికి బహు దూరం
నేత్రాలూ సమాధులే
సౌందర్యం బాహ్య అంతర్మధనం
ఏది అసత్యమో అది నిజమా
ప్రవహించే శోకంలో ఈదటమో మునగటమో
తన నిద్రని తానెప్పుడు చూసుకుంటాడు
ఒంటరి ఆకాశంలో ఒంటరి సముద్రం
అద్దంలో ఎవర్నీ చూడకపోతేనే అర్థం
ఖాళీ నేత్రమో, జిహ్వో, అధరమో ఎప్పటికీ ఆధారాలు కాలేవు
ఓ ముసలి పసి దుఃఖం సంభాషించే జ్ఞాపకమే
అందరిలో ఓ మరలిపోయే దూరం అతి దగ్గరగా
పుట్టినరోజులో తారీఖు లేదు
నిండు పుండు చావు
బతికే ఉన్న కళ్ళ వెనకే కన్నీళ్లు లేవు
మరణమే సూర్యుడి ఊపిరి
శాంత శిశ్న శివ స్మశానం
హృదయం నిర్గుణం
సమరం సమయం
సంఘంలో ప్రతి దృశ్యం శూన్య శత్రువు
ఊరించే ప్రతిదీ ఊరదు ఎప్పటికీ
ఊపిరిలో గాలి ఎవర్ని చూసింది
వెదురు నేత్రంలో శూన్య స్ప్రహ స్పర్శ మోక్షం
అనామక ఆకృతి అదృశ్యంలో
దృశ్యంలో నేత్రం ఎప్పటికీ లేదు
ముఖమే మారణహోమం
బాల్యం ఎక్కడో, మరెక్కడో ఎప్పటికీ కనిపించదు
తలుపుల్లోకి తపస్సు చేయలేని తలపుల నిశ్శబ్దం
పూలపై నిద్రించే దేహం రేపటికి లేదు //
నేత్రాలూ సమాధులే
సౌందర్యం బాహ్య అంతర్మధనం
ఏది అసత్యమో అది నిజమా
ప్రవహించే శోకంలో ఈదటమో మునగటమో
తన నిద్రని తానెప్పుడు చూసుకుంటాడు
ఒంటరి ఆకాశంలో ఒంటరి సముద్రం
అద్దంలో ఎవర్నీ చూడకపోతేనే అర్థం
ఖాళీ నేత్రమో, జిహ్వో, అధరమో ఎప్పటికీ ఆధారాలు కాలేవు
ఓ ముసలి పసి దుఃఖం సంభాషించే జ్ఞాపకమే
అందరిలో ఓ మరలిపోయే దూరం అతి దగ్గరగా
పుట్టినరోజులో తారీఖు లేదు
నిండు పుండు చావు
బతికే ఉన్న కళ్ళ వెనకే కన్నీళ్లు లేవు
మరణమే సూర్యుడి ఊపిరి
శాంత శిశ్న శివ స్మశానం
హృదయం నిర్గుణం
సమరం సమయం
సంఘంలో ప్రతి దృశ్యం శూన్య శత్రువు
ఊరించే ప్రతిదీ ఊరదు ఎప్పటికీ
ఊపిరిలో గాలి ఎవర్ని చూసింది
వెదురు నేత్రంలో శూన్య స్ప్రహ స్పర్శ మోక్షం
అనామక ఆకృతి అదృశ్యంలో
దృశ్యంలో నేత్రం ఎప్పటికీ లేదు
ముఖమే మారణహోమం
బాల్యం ఎక్కడో, మరెక్కడో ఎప్పటికీ కనిపించదు
తలుపుల్లోకి తపస్సు చేయలేని తలపుల నిశ్శబ్దం
పూలపై నిద్రించే దేహం రేపటికి లేదు //
Sunday, September 11, 2011
ఈ కవితకి అనువాదం మీ నుంచి కోరుతున్నాను. సహకరిస్తారా?
If I became a stone
If I became
a stone
stone would become
lotus
lotus,
lake
and if I became
a lake
lake would become
lotus
lotus,
stone.
If I became
a stone
stone would become
lotus
lotus,
lake
and if I became
a lake
lake would become
lotus
lotus,
stone.
Friday, September 09, 2011
చల్లటి రంగు నల్లన
చూడు
విను
చూడకు
వినకు
పదాలుండని మాటలేవో
విను
చేపల కలల్ని
చూడకు
రాళ్ల అలలని
వినకు
బంధించే కాలాన్ని
చీమలు కంటిలో
లేదు
ఉంపుడుకత్తె
సూర్యుడే
ఎప్పటికీ
కొన్నిసార్లు నీటి అద్దాలు ఖాళీగా ఎగురుతాయి మాటల్ల్లో
పిర్రల మబ్బులు
కళ్ళల్లోని నీటి చంద్రుడ్ని
నీటి సూర్యుడ్ని
ఓ
దుప్పటి గాలిలో
అటూ ఎటో
తిప్పుకునే
హృదయంలో ఉంచినా దొరకదు ఆకాశం
నీ ముందే ఉండే ఖాళీ పదం
నా ముందే ఉండే ఉంటున్న ఖాళీ పదం
నీ ముఖంలోనే పదాలు మారతాయి
బానిస జీతం మాటల హక్కు సమాధిలోనే
ఇచ్చే చూపుల్లో ఓదార్పు
రాని మౌనంలో ఓదార్పు
నాలుకపై ఓదార్పు
న్యాయంలో ఓదార్పు
విసిరేసేవే
విభజించే న్యాయమే
రక్తం
హింస
స్మృతి
స్వప్నాస్థి నిజమే నా దేశ ద్రోహులలో
వెతికే రిమోట్ ఎవరికీ లేదు
పోతామో
[పోదామో}
నిద్ర
కల
తృప్తిలోని సుదూరాలు
ఆకలే
మరో
అక్షర సత్యమే
అబద్ధం
తీసేసే ఆకారాలే పదాలు
ఐనా మదం లేదు పదంలో
అందం శూన్యమే
నవ్వావా
సూర్యుడే
ఎప్పటికీ
కొన్నిసార్లు నీటి అద్దాలు ఖాళీగా ఎగురుతాయి మాటల్ల్లో
పిర్రల మబ్బులు
కళ్ళల్లోని నీటి చంద్రుడ్ని
నీటి సూర్యుడ్ని
ఓ
దుప్పటి గాలిలో
అటూ ఎటో
తిప్పుకునే
హృదయంలో ఉంచినా దొరకదు ఆకాశం
నీ ముందే ఉండే ఖాళీ పదం
నా ముందే ఉండే ఉంటున్న ఖాళీ పదం
నీ ముఖంలోనే పదాలు మారతాయి
బానిస జీతం మాటల హక్కు సమాధిలోనే
ఇచ్చే చూపుల్లో ఓదార్పు
రాని మౌనంలో ఓదార్పు
నాలుకపై ఓదార్పు
న్యాయంలో ఓదార్పు
విసిరేసేవే
విభజించే న్యాయమే
రక్తం
హింస
స్మృతి
స్వప్నాస్థి నిజమే నా దేశ ద్రోహులలో
వెతికే రిమోట్ ఎవరికీ లేదు
పోతామో
[పోదామో}
నిద్ర
కల
తృప్తిలోని సుదూరాలు
ఆకలే
మరో
అక్షర సత్యమే
అబద్ధం
తీసేసే ఆకారాలే పదాలు
ఐనా మదం లేదు పదంలో
అందం శూన్యమే
నవ్వావా
Monday, September 05, 2011
ఎగరలేక
అన్ని ఆలోచనలు అంతమయ్యాక
కొన్నే పదాలతో ఆలోచనల్ని రమ్మంటాను
వొస్తాయో రావో ఎవరికి తెలుస్తుంది
అందమైనవి అందంగా ఎపుడూ లేవు
అరుదైనవి అందంగానూ లేవు
అర్థమవ్వనివీ అందంగా లేవెందుకో
సొంతమయ్యే ప్రతిదీ ఎంతో బాధపెడతాయి
బాధపెట్టే ప్రతిదీ ఎప్పటికీ సొంతమవ్వదు
బాధించేవే అన్నీనూ
అన్ని మాటలూ అంతమయ్యాక
కొన్ని ఆలోచనలు మరికొన్నై
పదాల్ని పిట్టల్ని చేసి ఎగరేస్తున్నాయి
ఎవరి రెక్కలో
ఎవరి ఆకాశామో
ఎవరికి తెలియచెప్పాలి
కొన్నే పదాలతో ఆలోచనల్ని రమ్మంటాను
వొస్తాయో రావో ఎవరికి తెలుస్తుంది
అందమైనవి అందంగా ఎపుడూ లేవు
అరుదైనవి అందంగానూ లేవు
అర్థమవ్వనివీ అందంగా లేవెందుకో
సొంతమయ్యే ప్రతిదీ ఎంతో బాధపెడతాయి
బాధపెట్టే ప్రతిదీ ఎప్పటికీ సొంతమవ్వదు
బాధించేవే అన్నీనూ
అన్ని మాటలూ అంతమయ్యాక
కొన్ని ఆలోచనలు మరికొన్నై
పదాల్ని పిట్టల్ని చేసి ఎగరేస్తున్నాయి
ఎవరి రెక్కలో
ఎవరి ఆకాశామో
ఎవరికి తెలియచెప్పాలి
Sunday, September 04, 2011
స్వప్నాస్థి
ఉంపుడుకత్తె
సూర్యుడే
ఎప్పటికీ
కొన్నిసార్లు నీటి అద్దాలు ఖాళీగా ఎగురుతాయి మాటల్ల్లో
పిర్రల మబ్బులు
కళ్ళల్లోని నీటి చంద్రుడ్ని
నీటి సూర్యుడ్ని
ఓ
దుప్పటి గాలిలో
అటూ ఎటో
తిప్పుకునే
హృదయంలో ఉంచినా దొరకదు ఆకాశం
నీ ముందే ఉండే ఖాళీ పదం
నా ముందే ఉండే ఉంటున్న ఖాళీ పదం
నీ ముఖంలోనే పదాలు మారతాయి
బానిస జీతం మాటల హక్కు సమాధిలోనే
ఇచ్చే చూపుల్లో ఓదార్పు
రాని మౌనంలో ఓదార్పు
నాలుకపై ఓదార్పు
న్యాయంలో ఓదార్పు
విసిరేసేవే
విభజించే న్యాయమే
రక్తం
హింస
స్మృతి
స్వప్నాస్థి నిజమే నా దేశ ద్రోహులలో
వెతికే రిమోట్ ఎవరికీ లేదు
పోతామో
[పోదామో}
నిద్ర
కల
తృప్తిలోని సుదూరాలు
ఆకలే
మరో
అక్షర సత్యమే
అబద్ధం
తీసేసే ఆకారాలే పదాలు
ఐనా మదం లేదు పదంలో
అందం శూన్యమే
నవ్వావా
సూర్యుడే
ఎప్పటికీ
కొన్నిసార్లు నీటి అద్దాలు ఖాళీగా ఎగురుతాయి మాటల్ల్లో
పిర్రల మబ్బులు
కళ్ళల్లోని నీటి చంద్రుడ్ని
నీటి సూర్యుడ్ని
ఓ
దుప్పటి గాలిలో
అటూ ఎటో
తిప్పుకునే
హృదయంలో ఉంచినా దొరకదు ఆకాశం
నీ ముందే ఉండే ఖాళీ పదం
నా ముందే ఉండే ఉంటున్న ఖాళీ పదం
నీ ముఖంలోనే పదాలు మారతాయి
బానిస జీతం మాటల హక్కు సమాధిలోనే
ఇచ్చే చూపుల్లో ఓదార్పు
రాని మౌనంలో ఓదార్పు
నాలుకపై ఓదార్పు
న్యాయంలో ఓదార్పు
విసిరేసేవే
విభజించే న్యాయమే
రక్తం
హింస
స్మృతి
స్వప్నాస్థి నిజమే నా దేశ ద్రోహులలో
వెతికే రిమోట్ ఎవరికీ లేదు
పోతామో
[పోదామో}
నిద్ర
కల
తృప్తిలోని సుదూరాలు
ఆకలే
మరో
అక్షర సత్యమే
అబద్ధం
తీసేసే ఆకారాలే పదాలు
ఐనా మదం లేదు పదంలో
అందం శూన్యమే
నవ్వావా
Thursday, September 01, 2011
:: వెక్కిరింత ::
అప్పటికే పెదాలపై కొన్ని వేల సంవత్సరాల రంగురంగుల పూలబుడగలు వాడి వాడున్నా
అప్పటికే వాసనేసే కొన్ని క్షణాల పదాల వాసనలు వాడి మాడి పడున్నా
అప్పటికే మరణించే కొన్ని కోట్ల ఊపిరి తీగలు నాని వాడి పాకకున్నా
అపుడెప్పుడో చేపనోట్లోని గాలిని తిని
అపుడెప్పుడో నీటి కంటిలోని వజ్రాల్ని దిగమింగి
అపుడెపుడో పిట్టకలలపై తిరిగే మబ్బుల్ని చెదరగొట్టి
అందుకేనా చేతుల్లోని సూర్యద్వారాల్ని మూసేస్తూ
అందుకేనా ముఖంలోని ఆకాశాల్ని చెరిపేస్తూ
అందుకేనా నేత్రాల్లోని సముద్రాల్ని కాల్చేస్తూ
తెరవకు తప్పిపోయే వాక్యాల్ని యీ పదాల్లో
అప్పటికే వాసనేసే కొన్ని క్షణాల పదాల వాసనలు వాడి మాడి పడున్నా
అప్పటికే మరణించే కొన్ని కోట్ల ఊపిరి తీగలు నాని వాడి పాకకున్నా
అపుడెప్పుడో చేపనోట్లోని గాలిని తిని
అపుడెప్పుడో నీటి కంటిలోని వజ్రాల్ని దిగమింగి
అపుడెపుడో పిట్టకలలపై తిరిగే మబ్బుల్ని చెదరగొట్టి
అందుకేనా చేతుల్లోని సూర్యద్వారాల్ని మూసేస్తూ
అందుకేనా ముఖంలోని ఆకాశాల్ని చెరిపేస్తూ
అందుకేనా నేత్రాల్లోని సముద్రాల్ని కాల్చేస్తూ
తెరవకు తప్పిపోయే వాక్యాల్ని యీ పదాల్లో
Subscribe to:
Posts (Atom)