Followers

Sunday, February 20, 2011

నా కలలో

నీటి బొగ్గులపై
ఎన్ని అనుభవాలైనా కాలాల్సిందే.
---
ఏ దస్తూరీ లేని కళ్ళతో
చూడటమే ఒక భయం.
---
కాయితాలు నిండని అక్షరాలు
అద్దంలోపల తిరగాలని.
---
అతీత స్వప్నముఖాలన్నీ
నిశ్శబ్ద స్పర్శలే.
---
వాక్యంత హృదయమే
మరో చీకటి లేని నిద్ర.
---
అచ్చుతప్పులుండాలి
అద్దం నీ అద్దంలోకి తొంగిచూస్తే.
---
ప్రవేశించే వాక్యాలకై
నిష్క్రమించే పదాల ఎదురుచూపు.
---
ఎండిన నది నీడ
అక్షరాల్నిండా ధూళి ధూళి.
---
నా శరీరాన్ని
నా కలలో వెతుకుతున్నా.