తలదాచుకున్న కన్నీళ్ళని
చెదరగొట్టకు
\
కారాగారపు రాత్రికేం తెలుసు
చంద్రుడి విన్యాసాలు
\
మూత్రిస్తున్న సూర్యుడికీ తెలియదు
స్వప్న ప్రేమలు
\
కూతురితో మాట్లాడే
తండ్రి మౌనమే అర్థమవ్వదు
\
నీళ్ళే కావాలా
కన్నీటి చూపుని శుభ్ర పరచాలంటే
\
ప్రతి దృష్టీ
ప్రమిద శ్వాసే
\
దేహం
మనసు
ఎప్పటికీ విలువలేనివే
Monday, January 31, 2011
Thursday, January 27, 2011
.పాత నాలుకే..
.ప్రతి మాటా అక్షరాలతోనే..
.ప్రతి అక్షరంలో సొంత కురుపు..
.పీచు వాక్యాలు..
.కాయితపు విన్యాసాలు..
.స్వప్నాంతర ద్వారాలు..
.దవ్వ అక్షరాలే చేరాయి మాటలై..
.అనుభూతి..
.అనుభవం..
.ఆనందం..
.ఎవరి అనువాదాలో..
.అక్షర చర్మంలో..
.పాత కథలే..
.పాత కళ్ళే..
.పాత నాలుకే..
.పాత కన్నీరే..
.ప్రతి అక్షరంలో సొంత కురుపు..
.పీచు వాక్యాలు..
.కాయితపు విన్యాసాలు..
.స్వప్నాంతర ద్వారాలు..
.దవ్వ అక్షరాలే చేరాయి మాటలై..
.అనుభూతి..
.అనుభవం..
.ఆనందం..
.ఎవరి అనువాదాలో..
.అక్షర చర్మంలో..
.పాత కథలే..
.పాత కళ్ళే..
.పాత నాలుకే..
.పాత కన్నీరే..
Saturday, January 22, 2011
ఒక గౌహతి రాత్రి
పనిరోజుల్లో చలి.
సరైన దుప్పటీ లేదు.
నిద్రెక్కడ.
___
రైలు కూత.
ఎవరి దూరమూ
ఎవరికీ తెలియనివ్వదు.
___
అనవసరమైన పదాలు.
పదాలతోనే అనువదించాలి.
___
హోటల్ తిండిలో
వెంట్రుక.
ఇంటికి ఎపుడెలతానో.
__
అప్పులే
సంవత్సరాల తరబడి
ఆదాయమే రోజుల్లో.
__
తీరిక లేదు.
నిను చేరే
మాటలూ లేవు.
__
ఇది ఏ రాత్రి.
రాత్రైతే రాత్రికీ తెలియదు.
హాజరు పట్టిక ఎక్కడుంది.
__
ఆహారం, ఆహ్లాదం
పొందటానికి
ఎంత అహంకారం కావాలి.
సరైన దుప్పటీ లేదు.
నిద్రెక్కడ.
___
రైలు కూత.
ఎవరి దూరమూ
ఎవరికీ తెలియనివ్వదు.
___
అనవసరమైన పదాలు.
పదాలతోనే అనువదించాలి.
___
హోటల్ తిండిలో
వెంట్రుక.
ఇంటికి ఎపుడెలతానో.
__
అప్పులే
సంవత్సరాల తరబడి
ఆదాయమే రోజుల్లో.
__
తీరిక లేదు.
నిను చేరే
మాటలూ లేవు.
__
ఇది ఏ రాత్రి.
రాత్రైతే రాత్రికీ తెలియదు.
హాజరు పట్టిక ఎక్కడుంది.
__
ఆహారం, ఆహ్లాదం
పొందటానికి
ఎంత అహంకారం కావాలి.
Friday, January 21, 2011
దాటాలి
ఏది చూస్తామో
అది
అదే రాయలేని వాళ్ళం
ఏ స్వరమూలేని పదాలతో
అక్షరాలు శబ్దిస్తే సరిపోతుందా
ప్రతి అక్షరంలోపల
శూన్య జ్వాల
తిరగేసినా
తిరగారాసినా
అక్షరంతో ఏదీ చూడలేము
దాచుకునే కంటికి
పదాలు ఉండవు
వాక్యాలమధ్య నడవటానికి
కొన్ని మాటల దారులు సరిపోవు
నిద్రలోకి దారి చేసి
నిద్రకీ దారి చూపి
ఎవరు నిద్రిస్తారు
దాటాలి
పదాలలోంచి
అది
అదే రాయలేని వాళ్ళం
ఏ స్వరమూలేని పదాలతో
అక్షరాలు శబ్దిస్తే సరిపోతుందా
ప్రతి అక్షరంలోపల
శూన్య జ్వాల
తిరగేసినా
తిరగారాసినా
అక్షరంతో ఏదీ చూడలేము
దాచుకునే కంటికి
పదాలు ఉండవు
వాక్యాలమధ్య నడవటానికి
కొన్ని మాటల దారులు సరిపోవు
నిద్రలోకి దారి చేసి
నిద్రకీ దారి చూపి
ఎవరు నిద్రిస్తారు
దాటాలి
పదాలలోంచి
Monday, January 17, 2011
కౌసు
సన్నటి వస్తువు
పల్చటి బరువు
దేహాంగి కాదులే
ఎంపిక లేదు
రాత్రికీ
పగటికీ
పొన్నంగి
దిశ ఏది
దేహయాత్ర
లేదులే
నిర్మోకముతో
తిరగాలి
బొందితోనే
ఎవర్ని పలకరించాలి
నా నన్నుతో
ఎప్పటికి మాట్లాడతాను
పల్చటి బరువు
దేహాంగి కాదులే
ఎంపిక లేదు
రాత్రికీ
పగటికీ
పొన్నంగి
దిశ ఏది
దేహయాత్ర
లేదులే
నిర్మోకముతో
తిరగాలి
బొందితోనే
ఎవర్ని పలకరించాలి
నా నన్నుతో
ఎప్పటికి మాట్లాడతాను
Saturday, January 15, 2011
ఏదీ రాయనపుడు
ఏదీ రాయనపుడు ఏదో ఆలోచించాను.
చేతుల్లోకి చేరని అన్నం మెతుకుల కోసమేనా.
కళ్ళల్లోకి తొంగిచూసే చావు కోసమేనా.
ఏదో ఆలోచించాను ఏదీ కనిపించనపుడు.
బిడ్డలున్న గాలిపటమై.
గోళీలు బిడ్డల్ని పెట్టినట్టు.
ఏదీ రాయనపుడు
ఏదీ లేదు.
అబద్ధాలు కావాలి.
నిజమైన అబద్ధాలు కావాలి.
చేతుల్లోకి చేరని అన్నం మెతుకుల కోసమేనా.
కళ్ళల్లోకి తొంగిచూసే చావు కోసమేనా.
ఏదో ఆలోచించాను ఏదీ కనిపించనపుడు.
బిడ్డలున్న గాలిపటమై.
గోళీలు బిడ్డల్ని పెట్టినట్టు.
ఏదీ రాయనపుడు
ఏదీ లేదు.
అబద్ధాలు కావాలి.
నిజమైన అబద్ధాలు కావాలి.
Sunday, January 09, 2011
ఊబి
నీటి నాలుకని తవ్వుకోవాలి
నదిలోపల ఇసుక పువ్వులు
చుట్టబెట్టే వరకు
మాటల వలయాల
ఊబి ఎంత
గూడుకట్టలేని సాలీడులోకి
నడిచే కళ్ళతో వెంబడించాలి
అనుమతి ఉండని నిద్రకి
నిద్రించే దేహం ఎందుకు
కాలపు నకలు ఎక్కడ
నాలుకలోకి సూర్యుడు
రాత్రి మధ్యలోని నది
నదిలోకి మునిగిపోయింది
పారిపోయే గాలే
అనాధ
తవ్వుకోవాలి నాలుక నీటిని
Subscribe to:
Posts (Atom)