Followers

Wednesday, December 14, 2011

అతృప్తి


. యీ మాట్లాడే చేతివ్రాత మాటలు ఇప్పటికీ అంతుచిక్కటం లేదు
. అవే ఎప్పటికీ దేనికీ ఎదురుచూడవు
. అవి తాకినా చలించిపోయే చర్మమే నాకైతే లేదు
. వాటి ఆలోచనల్లోకి ఆలోచనలు ఎలా వొస్తాయో
. ఇదంతా భాషే అని ఎంత గింజుకున్నా నమ్మలేకున్నా
. ఐతే వాటినే అనుసరిస్తున్నా అనుకరిస్తున్నా అంగీకరించలేకపోతున్నా
. పొతే చనిపోతే యీ మాటల్లోకి మాటలై అంతరించే మాటల్తోనే అంతరించాలి
. అమాటల సెలవు అతృప్తి సెలవు

1 comment:

Anonymous said...

ఇక్కడ
నీ చేతిరాత మాటలు
వనవాసి నవల
యుగళప్రసాద్ పూయించిన
నిసర్గ అడవిపూలు
ఈ రంగులు ఎవరినీ చూడవు
వీటిని ఇవే ఆఘ్రాణించవు