Monday, September 27, 2010
అద్దం ,అద్దంలో చూసి
Thursday, September 16, 2010
ప్రేమతో
పదాలు దూరమైతే
వాక్యాలే ఆందోళనలు
మరొకరిలోకి
( అండ త్రిభుజాలు)( సామూహిక వాంతులు)
( దేవులాడే దాహార్తి)
విస్తరించు నర్తించు నటించు(
ఒకరెవరో నిష్క్రమించాలి
Tuesday, September 14, 2010
వెతుక్కోవాలి
గొంతులోకి తొంగిచూసి
నకిలీ మాటలతో
Monday, September 13, 2010
రాయాలి
కాలాన్ని నాలుకతో వృధా చేయాలి
నలుగురు చేరని నాలుకతో జీవించాలి
కన్నీళ్లు రాని ఒక కన్నైనా ఉండాలి
కళ్ళు లేని మనసు పుట్టాలి
మెదడులో ఎండిన విషరక్తచారికల వాసన
నిద్ర చర్మాన్ని వొలుచుకుని తింటున్నారు
రంధ్రాల పడ్డ అక్షరాల్ని నేయాలి
మాటల బొమ్మలులేని వాక్యాల్ని రాయాలి
చెరిపేయాలి నిజాల్ని వల్లించే పదాల్ని
మరునాడు లేని రోజులో ఉండాలి
సెలవు చెప్పని కలల్ని వెంటబెట్టుకోవాలి
అనునిత్యం మరిచిపోయే జ్ఞాపకాల వెంటపడాలి
గోతులు గోడలు గోడు చెప్పే మాటలు
నదులు సముద్రాలు నీతులు చెప్పే మాటలు
చేపలు పిట్టలు చెప్పే మాటలు
రాసుకోవాలి
రాయాలి
Sunday, September 12, 2010
ఖాళీ లేని శూన్యం
నీ లోపల మరికొన్ని అక్షర చిత్రాలు
ఎవరి సంకేతాలు ఎవరికి చేరతాయి
చేరని సంఘటనలు ఎవరివి
ఎవరెవరి కోసం
సంజ్ఞల నిశ్శబ్ద స్పర్శ
స్పర్శల సంకేత నిశ్శబ్దం
ఎవరిని వెతుకుతుంది
యధాతథ యథార్థాల్లో యాత్రించే
యముని యశస్సు యెంత
ప్రతిదీ ఒకానొక చిత్ర వ్యక్తీకరణ
అవ్యక్త చిత్ర పదాల్లో నిజమెంత
పదాల అనుభవంలో నిజం ఉందా
లిపిలేని ఆలోచనలనే అనుభవిస్తున్నామా
ముడిపడని ముడివిడవని మాటల అనుభవం ఏమిటి
ఖాళీ లేని శూన్యం
ప్రవేశించే పదాల ఖాళీలో అనుభూతి యెంత
తిరిగి పలకని కల
Thursday, September 09, 2010
మసక మాటలు
అందరి పాదాల ముందు మసక మాటలు రాలి వాలిన నెలవంక వంక చూసే చూడనట్టు నటించిన సూర్యుడి ముడతల కంటిలో ఇరుక్కోవాలనుకున్న ఉడత మడత తోక తొడతో కోసుకుపోయిన చంద్రుడి ఊడల నవ్వులకేసి ఊగుతూ ఉంటే వాసనేస్తున్న వాన పదాల దారాల్ని తుంచుతూ వొంచుతూ లాగుతూ తాబేటి మెడ కింద దాగిన సముద్రపు నక్షత్రాలు నగ్నశాంతిని తాగుతూ ఉంటుండగా పూసిన ఈకలతో కాయితాలపై ఎగురుతున్న చెవుల వంతెనల కింద కొట్టుకొస్త్తున్న కుట్టుకొస్తున్న కన్నీటి చిరుగుల బొమికల రెక్కల్ని జాగ్రత్త చేస్తూ వాచిన వాచీ సమయం తేలుతూ పైకి లేస్తుంటే కారుతున్న జ్ఞాపకాల వడపోతలోంచి వొడలిరిగిన వోటమి జీవితాన్ని వొదలక ముగింపు లేక అక్కడక్కడ కవిత్వపు నక్కల నకలు వాక్యాలతో నిద్రిస్తుంటే జారుతున్న చీకటి దేహ ఖైదీనై మరణించు మరణించు మరణించు అని ఆదేశించే ఆత్మని తన్నకుండా విడిచిపెట్టేలోపే ఎక్కడ్నుంచో మనల్ని చంపే గాలిలో జెరాక్స్ చావులు యెగిరి వొస్తుంటే ఆసుపత్రి ఆకలిగా ఆవులిస్తోంది మర్చిపోయిన అక్షరాల్ని మగత గతంలో నెమరేసుకుంటూ దవడల వొదులు వొదులు పదాల్ని నల్లగా చప్పరిస్తూ చెట్లపై ఊగుతున్న చంద్రుడ్ని చూస్తున్న కలువలన్నీ ఏదీ వినటం లేదు ఆఖరి రంగు ఏదో చూడటం మానుకున్నాయి అప్పటికే అప్పటి పాదాల కింద ఏ ముసలి రూపం అద్దంలో నడిచిందో ఎవరూ చెప్పలేదు చెప్పరెవరూ మరణమూ ఒక జీవితమే అని అనుకోకుండా ఉండాలేమో తల్లీ నదిలో అందరి పాదాలు మసక మసకగా మునకలేస్తూ అడుగుజాడలు లేకుండా వర్షంలో వర్షం తెగుతూ ఎగురుతూ మిగలని చీకటిలో వణుకుతూ...