ఏ హృదయాన్నైనా చీల్చి సంభాషిస్తావు
నువ్వే రూపుదిద్దిన విష లాలనతో.
ఏ భ్రమకైనా విశాల స్తన్యానిస్తావు
నువ్వే విమోహించే అపరిశుబ్ర ద్వేషంతో.
ఏ క్రూర నిషా శబ్దానైనా నుసి చేస్తావు
నువ్వే కౌగిలించుకున్న ఆలోచనలతో.
ఏ కాలాన్నైనా తృణీకరిస్తావు
నువ్వే ఆహ్వానించే మరణ కక్షలో.
ఏ రోదనైన మరుగుజ్జౌతుంది
నువ్వే పురుడుపోసిన దుఃఖంతో.
అపుడు,
ఏ నీ మౌనమూ లేదు నాకు.
అప్పుడే,
ఏ నీ స్పర్శా లేదు నాకు.
Saturday, January 30, 2010
Tuesday, January 05, 2010
అటు రావాలి
తిరగేసిన నీడల
పాదాల్ని రమ్మని ...
...అంతలో
కల వొంట్లో కలయతిరుగుతుంటే
నక్షత్ర కీటకాలు
పాదాల్ని రమ్మని ...
...అంతలో
కల వొంట్లో కలయతిరుగుతుంటే
నక్షత్ర కీటకాలు
నలుదిక్కులూ నిల్చొని
పడవ పువ్వుల్ని ఎత్తుకుపోతుంటే
అద్దం లోపలి చీకటినీ
ఎదురుబొదురు ఎగిరే సమయాల్నీ
మాటలు లేని జ్ఞాపకాల్నీ
ముగింపులేని నా శబ్దాల్నీ
అలల్ని ఆపే సూర్యచంద్రుల్నీ
కొయ్య కళ్ళ కలల్నీ
ఇక రావద్దన్నాను
ఎప్పటికైనా
తిరిగిరాని కన్నీళ్ళతో
నేత్రముద్రలు లేని నిద్రలో ఉండాలి
పడవ పువ్వుల్ని ఎత్తుకుపోతుంటే
అద్దం లోపలి చీకటినీ
ఎదురుబొదురు ఎగిరే సమయాల్నీ
మాటలు లేని జ్ఞాపకాల్నీ
ముగింపులేని నా శబ్దాల్నీ
అలల్ని ఆపే సూర్యచంద్రుల్నీ
కొయ్య కళ్ళ కలల్నీ
ఇక రావద్దన్నాను
ఎప్పటికైనా
తిరిగిరాని కన్నీళ్ళతో
నేత్రముద్రలు లేని నిద్రలో ఉండాలి
Sunday, January 03, 2010
మగ దీపం*
ఒక చెట్టు, మధ్యాన్నం తార్రోడ్డుపై సముద్రపు గాలినో, నదిలో కలిసే సముద్రపు నీటి గాలినో వెంటబెట్టుకొని నవ్వుతో కూర్చుంది. ముడతలు లేని కొమ్మలపై వాలని నక్షత్రాలని, సూర్యుణ్ణి నిద్ర పొమ్మంది. ఇంతలో, ఎక్కడికీ చేరలేని గడియారపు సాలిగూడులోన్చి ప్రయాణిస్తుంటే, ఇల్లు ముక్కలైంది. మునుపటి మొక్కలూనూ. కీటకాలూనూ. ఎవరి కుబుసమో తోడుకుంటున్న ఇల్లుకాని ఇల్లిది. దారిలేని చీకటి బిందువులు అభయమివ్వవు. భయపెట్టే అవిభాగ కపట పదాలే ఆత్మీయులు. నిద్ర ఒద్దులే. లిప్ స్టిక్ లిపిలో దాగున్న ప్రేమలు తుడుసుకుంటున్నా, కొన్ని మరకలు అరమరికలు లేకుండా నవ్వుతాయి. కాగి ఎగిరే వయసే, వికృత హస్తాలతో ఆహ్వానిస్తోంది. అందుకునే కలల పాదాలపైన ఉరితాళ్ళు. అంతరించని పగటి ప్రగతి పులివేషాలు. స్మరనార్ధుల సమాధుల్లో ఉండకే, అంత్యక్రియలు లేవు వాటికి. చీలిన కంటిపాపల్లో బొడ్డులేని కన్నీళ్ళు. నర్తించు మూస మనుగడలో అని చెట్టు లోపలి రాత్రి ఒక మధ్యాన్నపు గాలిని ఎగరగొట్టింది.
* పొద్దు.నెట్లో ప్రచురించారు.
* పొద్దు.నెట్లో ప్రచురించారు.
Subscribe to:
Posts (Atom)