చీకటి బిందువులతో వాక్యాల్ని చెరిపేయగలవు
పదాల మధ్య బొంగురుగా మొరుగుతున్నా
అంతటా శునక నిశబ్దమే
దేవుడా!
నాకో తొంబై లక్షల నాలుకలివ్వు
అర నాలుకేనా ఇంకెప్పటకీ
పోనీ,
అరిగిపోని, ఆవిరవ్వని, అంటురోగమవ్వని
ప్రాంతీయ భక్తైనా
నా నాలుకపై రాయబ్బా
నీయబ్బ
ఈ నత్తి నెత్తుటి నాలుక నేలమీద
నీ నీడుండదు
ఇంకెప్పటికీ
Saturday, December 26, 2009
Thursday, December 24, 2009
వాగ్విశ్రాంతి
సమీప శబ్దాలతో
పదాల వాక్యాల్ని సంధించాలని అతడూ ఉవ్విళ్ళూరాడు
అందుబాటులో ఉన్నవన్నీ దరిచేరాయి
లేనివి నిరాకరించాయి
అక్షరచుంచువు చుట్టూ పరిభ్రమించే నిరాకార భ్రమలు
సంకేత శోధనలో మృగ్యమౌతున్నదుఃఖం
ముద్రారాక్షశాల్లో సర్పవలయాలు
అపరిష్కారమౌతున్న స్పష్టాస్పష్ట నిరుక్త ధ్వనులు
ఉచ్చరించే మౌనమేదో అతన్ని ఆక్రమించింది
ప్రాణప్రదమైన ఆలోచనలూ లేవు గాలివిసురు జ్ఞాపకాల్లో
ఏదీ కోరని అక్షరాకాశానికి నక్షత్ర ఖచితమొనర్చాడు
అంతర్ధానమయ్యే అనుభవాల్లో
నిబిడాన్ధకార శబ్దస్పర్శలు...
యాదృచ్చిక భవిష్యత్తులో వాక్యసామీప్యాలు లేవతనికి
అతడి మాటలకి అక్షరాలూ లేవు
అతడొక వాక్య విస్మృతి
అతడొక వాగ్విశ్రాంతి
పదాల వాక్యాల్ని సంధించాలని అతడూ ఉవ్విళ్ళూరాడు
అందుబాటులో ఉన్నవన్నీ దరిచేరాయి
లేనివి నిరాకరించాయి
అక్షరచుంచువు చుట్టూ పరిభ్రమించే నిరాకార భ్రమలు
సంకేత శోధనలో మృగ్యమౌతున్నదుఃఖం
ముద్రారాక్షశాల్లో సర్పవలయాలు
అపరిష్కారమౌతున్న స్పష్టాస్పష్ట నిరుక్త ధ్వనులు
ఉచ్చరించే మౌనమేదో అతన్ని ఆక్రమించింది
ప్రాణప్రదమైన ఆలోచనలూ లేవు గాలివిసురు జ్ఞాపకాల్లో
ఏదీ కోరని అక్షరాకాశానికి నక్షత్ర ఖచితమొనర్చాడు
అంతర్ధానమయ్యే అనుభవాల్లో
నిబిడాన్ధకార శబ్దస్పర్శలు...
యాదృచ్చిక భవిష్యత్తులో వాక్యసామీప్యాలు లేవతనికి
అతడి మాటలకి అక్షరాలూ లేవు
అతడొక వాక్య విస్మృతి
అతడొక వాగ్విశ్రాంతి
Monday, December 21, 2009
స్వప్న రేణువులు
చీకటి కొమ్మలపై
చంద్రుడి గాలిపటం
చిరక్కుండా
- -
పారిపోయొచ్చిన హరివిల్లుని
ఇంటికి తీసుకెళ్ళింది తూనీగ
- -
నిదుర పలకని
కలల్తో బరికాను
ఇక తుడిచేదెవరో
- -
పథికుల కోసం
నిద్ర చీకటిలో
దీపాల్ని వెలిగిస్తోంది కల
- -
ఏ దీనురాలి బిడ్డలో
మెరుపు పిల్లలు
దారి తప్పారు
- -
గాలి వాసన
చడీచప్పుడు లేకుండా
అద్దంలో
- -
దిండు కింద కల
నక్కిన పేనులా నిద్ర
- -
లేలేత రెక్కలతో
తిరుగుతోంది
నా కల కొండ
- -
నా పడక నేలమీదే
కలలకే దుమ్మంతా
- -
నిద్ర చెరువులో
నీటి కుక్కను
తోకాడిస్తూ కలలు
- -
స్వప్న రహదారిలో
అడ్డంగా సూర్యుడు
- -
మట్టి పడవలు ఎక్కుతున్న
కల ఒకటి
నిద్ర తీరాన్ని చేరేదేప్పుడో!
చంద్రుడి గాలిపటం
చిరక్కుండా
- -
పారిపోయొచ్చిన హరివిల్లుని
ఇంటికి తీసుకెళ్ళింది తూనీగ
- -
నిదుర పలకని
కలల్తో బరికాను
ఇక తుడిచేదెవరో
- -
పథికుల కోసం
నిద్ర చీకటిలో
దీపాల్ని వెలిగిస్తోంది కల
- -
ఏ దీనురాలి బిడ్డలో
మెరుపు పిల్లలు
దారి తప్పారు
- -
గాలి వాసన
చడీచప్పుడు లేకుండా
అద్దంలో
- -
దిండు కింద కల
నక్కిన పేనులా నిద్ర
- -
లేలేత రెక్కలతో
తిరుగుతోంది
నా కల కొండ
- -
నా పడక నేలమీదే
కలలకే దుమ్మంతా
- -
నిద్ర చెరువులో
నీటి కుక్కను
తోకాడిస్తూ కలలు
- -
స్వప్న రహదారిలో
అడ్డంగా సూర్యుడు
- -
మట్టి పడవలు ఎక్కుతున్న
కల ఒకటి
నిద్ర తీరాన్ని చేరేదేప్పుడో!
Friday, December 04, 2009
స్వభావం
గదిలోపల దీపం ఊపిరి
తగ్గుతోందన్న వణుకు
కళ్లు తెరిచి అన్నింటినీ
చివరిగా పరికిస్తోంది
హత్తుకోగల్గిన
రూపమేదీ లేదు
పవిత్ర ఆనందం
క్షీణిస్తోంది
స్వాధీన
స్పర్సలు లేవు
నాట్యముద్రల చాయలన్నీ
ఆహార్యాల ముడులిప్పుకుంటున్నాయి
తనలో తానూ
తలవంచుకుంటోంది దీపం
నిశ్శబ్దాన్ని ద్వేషిస్తూ
తగ్గుతోందన్న వణుకు
కళ్లు తెరిచి అన్నింటినీ
చివరిగా పరికిస్తోంది
హత్తుకోగల్గిన
రూపమేదీ లేదు
పవిత్ర ఆనందం
క్షీణిస్తోంది
స్వాధీన
స్పర్సలు లేవు
నాట్యముద్రల చాయలన్నీ
ఆహార్యాల ముడులిప్పుకుంటున్నాయి
తనలో తానూ
తలవంచుకుంటోంది దీపం
నిశ్శబ్దాన్ని ద్వేషిస్తూ
Subscribe to:
Posts (Atom)