ఇష్టం లేని వాక్యమే
ఈ సమాధి. అంతమవ్వని ఇష్టం.
తెగని గ్రీన్ గ్రీఫ్
శవపేటిక శ్వాసిస్తోంది మూడు ముళ్ళ బొడ్డుతో.
ఏ చిత్రం కిందో
అలుక్కుపోయిన అలలు.
ఆలోచించి చెప్పకు
కన్నీళ్ళు ఏమంటున్నాయో.
నేత్రంలో లేని అక్షరాల్తో
వస్తావా? రాకే.
రా ... వద్దు
పూర్ణాంతర శూన్యంలోకి.
Saturday, October 31, 2009
Monday, October 26, 2009
అపూర్ణ
ఇప్పటిది కాదులే
శరీర వాసన
జ్వలించి, జల్లించి, జాతరించి
పేనిన మమైకాన్ని తోడు
తోడు రాని
తోడ ...తొడ
శహన రాగపు రంగేది?
ఒడలిన ఒదిలిన
వయో స్వప్నాల్లో నువ్వెవరు?
ముకుళించే
రూపనాదాలన్నీ అలిఖితాలేనా?
కృశించే జన్మ క్రియలన్నీ
అలభ్య అజ్ఞాతాలేనా?
ఇప్పటిది కాదులే
వాక్య వ్యళీకం
శరీర వాసన
జ్వలించి, జల్లించి, జాతరించి
పేనిన మమైకాన్ని తోడు
తోడు రాని
తోడ ...తొడ
శహన రాగపు రంగేది?
ఒడలిన ఒదిలిన
వయో స్వప్నాల్లో నువ్వెవరు?
ముకుళించే
రూపనాదాలన్నీ అలిఖితాలేనా?
కృశించే జన్మ క్రియలన్నీ
అలభ్య అజ్ఞాతాలేనా?
ఇప్పటిది కాదులే
వాక్య వ్యళీకం
నువ్వు నన్ను ...
పాతిపెట్టిన విత్తనంలోని చిగురాకూ నిద్రలో ఉంది
ఎందుకు నన్నీ వాక్యంముందు లేని అద్దంలో ఉంచుతావ్
తిరిగి చూడని అర్థాల్తో కాలం నల్లబడింది
ప్రేమే మరొక నలుపు కుంచె
నిస్తేజమైన వస్తువులన్నీ కదులుతున్నాయ్
నా నిరీక్షనే ప్రయాణించట్లేదు
ఏ వెలితీలేని అక్షరాలమధ్య
మళ్ళీ అక్షరం రాయటమే దుఃఖం
నువ్వు నన్ను సమాధిచేసుకునే నిశ్శబ్దానివి
ఎందుకు నన్నీ వాక్యంముందు లేని అద్దంలో ఉంచుతావ్
తిరిగి చూడని అర్థాల్తో కాలం నల్లబడింది
ప్రేమే మరొక నలుపు కుంచె
నిస్తేజమైన వస్తువులన్నీ కదులుతున్నాయ్
నా నిరీక్షనే ప్రయాణించట్లేదు
ఏ వెలితీలేని అక్షరాలమధ్య
మళ్ళీ అక్షరం రాయటమే దుఃఖం
నువ్వు నన్ను సమాధిచేసుకునే నిశ్శబ్దానివి
Sunday, October 25, 2009
ఒక్కోసారి బతికుండం
ఇదే చివరి కాయితం
ఇప్పటి రాత్రి చివరిదీనూ
కొనసాగే మాటల్లోని మాటలు
నేత్రగర్భాల్లోని నిశ్శబ్ద వైరుధ్యాలు
ఎవరెంతసేపో చూస్తున్న చిత్రాలన్నీ
ఖాళీ ధ్వనుల్లోనే శిలాజాలై
ఇంతకీ మనకొక కౌగిలిలేని స్వేచ్చ
ఎంతకీ తరగని మౌన తమస్సు
తుప్పర తుప్పర దేహాశ్రువులు
ఎవరెవరివో, చూడకే
ఒక్కోసారి బతికుండం
మరోసారి బతికుండాలనుకుంటాం
ఇదే చివరాఖరి శిల్పనేత్రం
బయలుదేరిన చూపులోనే శిల్పాశ్రువు
ఇప్పటి రాత్రి చివరిదీనూ
కొనసాగే మాటల్లోని మాటలు
నేత్రగర్భాల్లోని నిశ్శబ్ద వైరుధ్యాలు
ఎవరెంతసేపో చూస్తున్న చిత్రాలన్నీ
ఖాళీ ధ్వనుల్లోనే శిలాజాలై
ఇంతకీ మనకొక కౌగిలిలేని స్వేచ్చ
ఎంతకీ తరగని మౌన తమస్సు
తుప్పర తుప్పర దేహాశ్రువులు
ఎవరెవరివో, చూడకే
ఒక్కోసారి బతికుండం
మరోసారి బతికుండాలనుకుంటాం
ఇదే చివరాఖరి శిల్పనేత్రం
బయలుదేరిన చూపులోనే శిల్పాశ్రువు
Sunday, October 11, 2009
The Empty Leaf
పెరుగుతున్న ఆకులో
ఆలోచిస్తున్న మరణం అందదు
తీరం దాటిన ఆకులు
హృదయం దాటని ఆకులు
నిరాధార జ్ఞాపకాల్లో
మన్ను పెదాలు, ఎముకలు
మసి నిద్రలో
నువ్వే బంధించిన జ్ఞాపకం నా శ్వాస
మైకంలా
వ్యర్థమయ్యే సమయం
వెన్నెల కడుపులో
దర్పణ శోకాలు
జీవ నిక్షేపాలు
తొలి ప్రతిమల సమాధులు
తడి తడి గాలి నీడ
నేత్ర ఆయువై
చెదిరిపోతున్న చూపుల్లోంచి
నిలకడలేని మాటల్లోంచి
వొస్తున్న ఒంటరి నిశ్శబ్దం
జారిపోవాలని నిద్రపోతాను
ఎల్లలు దాటే స్పర్సలు ఎక్కడ
మమతల మైకంలో ఎవరున్నారు
భాగాహారమౌతున్న భావాల్లో భారాలెన్నో
ముంచుతున్న సొంత ఏకాంత కౌగిలి కథలు
శ్వాస వీధిలో వెలిగే నింగి పరిమళాలు ఎక్కడ
మనసు దాహాన్ని తీర్చే ఆకృతులు లేవు
కమ్ముకొచ్చే ధ్యానశోకం ఏకాకి కదూ
ఉంటూ ఉండే మసక కలలో
కలల మసకో తోడుంటూ
అనుభూతుల ఉయ్యాలనూగుతుంటే
అటే ఎగిరిపోతుంది ఉయ్యాల
ఆకుటుయ్యాలలో చంద్రుడు
నీటి ఉయ్యాలలో సూర్యుడు
ఆకాశమొక ఆకు
తెగిపడి, ఎగిరెగిరిపోయింది
కంట్లోని ఆకుల కింద
కన్నీటి గుడ్లు
అటూ ఇటూ తిరుగుతూ
చీమ ఒకటి
ఆలోచిస్తున్న మరణం అందదు
తీరం దాటిన ఆకులు
హృదయం దాటని ఆకులు
నిరాధార జ్ఞాపకాల్లో
మన్ను పెదాలు, ఎముకలు
మసి నిద్రలో
నువ్వే బంధించిన జ్ఞాపకం నా శ్వాస
మైకంలా
వ్యర్థమయ్యే సమయం
వెన్నెల కడుపులో
దర్పణ శోకాలు
జీవ నిక్షేపాలు
తొలి ప్రతిమల సమాధులు
తడి తడి గాలి నీడ
నేత్ర ఆయువై
చెదిరిపోతున్న చూపుల్లోంచి
నిలకడలేని మాటల్లోంచి
వొస్తున్న ఒంటరి నిశ్శబ్దం
జారిపోవాలని నిద్రపోతాను
ఎల్లలు దాటే స్పర్సలు ఎక్కడ
మమతల మైకంలో ఎవరున్నారు
భాగాహారమౌతున్న భావాల్లో భారాలెన్నో
ముంచుతున్న సొంత ఏకాంత కౌగిలి కథలు
శ్వాస వీధిలో వెలిగే నింగి పరిమళాలు ఎక్కడ
మనసు దాహాన్ని తీర్చే ఆకృతులు లేవు
కమ్ముకొచ్చే ధ్యానశోకం ఏకాకి కదూ
ఉంటూ ఉండే మసక కలలో
కలల మసకో తోడుంటూ
అనుభూతుల ఉయ్యాలనూగుతుంటే
అటే ఎగిరిపోతుంది ఉయ్యాల
ఆకుటుయ్యాలలో చంద్రుడు
నీటి ఉయ్యాలలో సూర్యుడు
ఆకాశమొక ఆకు
తెగిపడి, ఎగిరెగిరిపోయింది
కంట్లోని ఆకుల కింద
కన్నీటి గుడ్లు
అటూ ఇటూ తిరుగుతూ
చీమ ఒకటి
Saturday, October 10, 2009
రాత్రించరుడా...నిద్రెప్పుడో
మరుగుతున్న విశ్రాంతి కుంపట్లోంచి
బైటికొచ్చిన చంద్రుడిపై రాత్రినీళ్ళని చల్లాను.
ఆకాశం నక్షత్రాల బొగ్గుల్ని రాజేస్తూనే ఉంది.
వెన్నల విభూది రాసుకున్న నదిలో
రహస్య రెక్కల్తో రికామిగా తిరిగే
కలల్ని విప్పి కుంపట్లోకి విసిరాను.
మనసు లంగోటీని గిరాటేశాను.
వేయి సముద్రాల ఇంద్రధనుస్సై
నిద్ర, దేహంలో జడ విరబోసుకుంది.
ఏ దారీతెన్నూలేని సూర్యుడే
పసిపిల్లల కేరింతల్లా ఒక్కసారిగా
నన్నీ యవ్వన రోమ్ముల్లాంటి దినచర్యల్లోకి గెంటాడు.
నిద్ర మళ్ళీ ఎప్పుడో.
బైటికొచ్చిన చంద్రుడిపై రాత్రినీళ్ళని చల్లాను.
ఆకాశం నక్షత్రాల బొగ్గుల్ని రాజేస్తూనే ఉంది.
వెన్నల విభూది రాసుకున్న నదిలో
రహస్య రెక్కల్తో రికామిగా తిరిగే
కలల్ని విప్పి కుంపట్లోకి విసిరాను.
మనసు లంగోటీని గిరాటేశాను.
వేయి సముద్రాల ఇంద్రధనుస్సై
నిద్ర, దేహంలో జడ విరబోసుకుంది.
ఏ దారీతెన్నూలేని సూర్యుడే
పసిపిల్లల కేరింతల్లా ఒక్కసారిగా
నన్నీ యవ్వన రోమ్ముల్లాంటి దినచర్యల్లోకి గెంటాడు.
నిద్ర మళ్ళీ ఎప్పుడో.
ప్రార్థన
"ముమ్మరంగా పెనుగులాడు
కెరటాలతో విసిగున్నాను."
కడలి, తీరం ఫిర్యాదుకి,
"వల్లమాలిన ప్రేమే,
నీలా సదా అంటిపెట్టుకున్దామనుకునే
ప్రియుడికి తెలియఖరల్లేదులే."
దయాశీలీ!
మరో జన్ముంటే నాకో కడలి జన్మ ఇవ్వు.
కెరటాలతో విసిగున్నాను."
కడలి, తీరం ఫిర్యాదుకి,
"వల్లమాలిన ప్రేమే,
నీలా సదా అంటిపెట్టుకున్దామనుకునే
ప్రియుడికి తెలియఖరల్లేదులే."
దయాశీలీ!
మరో జన్ముంటే నాకో కడలి జన్మ ఇవ్వు.
Thursday, October 08, 2009
ఎవరెవరమో
అమ్మ
అమ్మ
అమ్మమ్మ
అంటే ఎవరు?
ఆమె కూడా అమ్మేనా?
అమ్మ ఎలా ఉంటుంది, నాన్న కూడా అమ్మలా ఉంటారా
నా కూతురికి నేను అమ్మనా
నా లోని నాన్నకి నేను కూతురవ్వగలనా
ఎవరు ఎవరి పిల్లలు
పిల్లలు ఎవరికి పిల్లలు
పెద్ద పెద్ద బొమ్మలు
కళ్లు పట్టనంత బొమ్మలు
అమ్మకి , నాన్నకి
నేను ఎవరు
నేను అనే దేహం
ఏ దేహం నుంచి వచ్చిందో
మళ్లీ
నేను
నీవు
ఎవరెవరమో
అమ్మ
అమ్మమ్మ
అంటే ఎవరు?
ఆమె కూడా అమ్మేనా?
అమ్మ ఎలా ఉంటుంది, నాన్న కూడా అమ్మలా ఉంటారా
నా కూతురికి నేను అమ్మనా
నా లోని నాన్నకి నేను కూతురవ్వగలనా
ఎవరు ఎవరి పిల్లలు
పిల్లలు ఎవరికి పిల్లలు
పెద్ద పెద్ద బొమ్మలు
కళ్లు పట్టనంత బొమ్మలు
అమ్మకి , నాన్నకి
నేను ఎవరు
నేను అనే దేహం
ఏ దేహం నుంచి వచ్చిందో
మళ్లీ
నేను
నీవు
ఎవరెవరమో
Subscribe to:
Posts (Atom)