Followers

Wednesday, October 25, 2017

|| పారిపోకు ||

తప్పిపోయే తర్ఫీదు మాటలతో
క్షణకణాల కరుణలో మిగుల్తావ్
లొంగని అక్షరాల అంతర్బుద్ధితో
విచారణనే వివరించు వాక్యాల్తో
వొలకని వొంటరి నిశ్శబ్దనటనేదో చేస్తావ్
అసంతృప్తుడా
సదృశ్య తాండవంలో ఘనీభూతమవుతావ్
ఆవరించిన ద్రోహమేదో
విస్తరిస్తోంది